ఇన్నాళ్లు హీరోగా వెండితెరను ఏలేసిన బాలకృష్ణ.. ఇప్పుడు హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే పేరుతో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు నాలుగో సీజన్ ప్రారంభమయ్యింది. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ తర్వాత లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ కోసం మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, కంగువ సినిమా కోసం హీరో సూర్య రాగా.. పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే.
పుష్ప2 మూవీ కోసం అల్లు అర్జున్ వచ్చిన ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేశారు. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ కోసం శ్రీలీల, నవీన్ పొలిశెట్టి వస్తున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల, హీరో నవీన్ పొలిశెట్టి అతిథులుగా వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా వీరిద్దరి ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.
తాజాగా విడుదలైన గ్లింప్స్ లో శ్రీలీల తన డాన్స్ తో అదరగొట్టింది. ఆ తర్వాత బాలయ్య, నవీన్ పొలిశెట్టి ఇద్దరి మధ్య సరదా కామెడీ ఆకట్టుకుంది. అలాగే తనలో ఉన్న మరో టాలెంట్ చూపించింది. వీణ వాయించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ గ్లింప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.