అక్కడ ఆఫర్ వచ్చిందని.. ఆమె ఎవ్వరికీ చెప్పకుండా షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది.. శ్రీవిష్ణు షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ విష్ణు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ తర్వాత హీరోగా మారి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. శ్రీ విష్ణు నటించే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం మంచి ఆసక్తి ఉంటుంది. కథలు కూడా కొత్తగా అనిపిస్తుంటాయి.

యంగ్ టాలెంట్ శ్రీవిష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేస్తూ పేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సింగిల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మే 9న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ టీమ్ చాలా బిజీగా ఉన్నారు. శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీవిష్ణు పాత ఇంటర్వ్యూలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి. గతంలో ఆయన ఓ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ హీరోయిన్ సినిమా షూటింగ్ మధ్యలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వెళ్లిపోయిందని శ్రీవిష్ణు చెప్పుకొచ్చారు.
ఓ నటి తమ సినిమా షూటింగ్ లో ఉండగానే చెప్పా పెట్టకుండా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వెళ్లిపోయిందట. ఈవిషయాన్ని శ్రీవిష్ణు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీవిష్ణు నటించిన సినిమాల్లో ఓం భీమ్ భీష్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కామెడీ హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీ విష్ణుతో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కూడా నటించారు. అలాగే ఈ సినిమాలో అయేషా ఖాన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఓం భీమ్ భీష్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అయేషా ఖాన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఓం భీమ్ భీష్ సినిమా రిలీజ్ ఆలస్యం అవ్వడానికి అయేషా ఖాన్ కూడా ఓ కారణం అని అన్నారు శ్రీవిష్ణు. సినిమా షూటింగ్ లో ఉండగా చెప్పాపెట్టకుండా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వెళ్లిపోయిందని తెలిపాడు శ్రీవిష్ణు. కనీసం ఆమె సెట్ లో ఎవరికీ చెప్పలేదని.. బిగ్ బాస్ కు వెళ్లి అక్కడ క్రేజ్ తెచ్చుకుందని తెలిపాడు శ్రీ విష్ణు. ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అయేషా ఖాన్ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది. ఈ అమ్మడు హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అందుకుంటుంది ఈ చిన్నది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.