సైన్స్ యూనివర్సల్, తప్పుంటే క్షమించు దాదా: అక్షయ్

అక్షయ్ కుమార్ హీరోగా..విద్యా బాలన్‌, తాప్సి, నిత్యా మేనన్‌, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మిషన్‌ మంగళ్‌‌’. ఈ మూవీ టీజర్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ పోస్టులు పెడుతున్నారు ఈ చిత్ర టీజర్‌ను చూసిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ  ప్రశంసలు కురిపించారు. ‘ఆకాశమే హద్దు అనుకుని ధైర్యం, నమ్మకం, మనోబలంతో ముందుకు సాగిన మహిళల కథల్ని సినిమాగా చూపిస్తున్నందుకు […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:28 pm, Sat, 3 August 19
సైన్స్ యూనివర్సల్, తప్పుంటే క్షమించు దాదా: అక్షయ్

అక్షయ్ కుమార్ హీరోగా..విద్యా బాలన్‌, తాప్సి, నిత్యా మేనన్‌, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మిషన్‌ మంగళ్‌‌’. ఈ మూవీ టీజర్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ పోస్టులు పెడుతున్నారు ఈ చిత్ర టీజర్‌ను చూసిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ  ప్రశంసలు కురిపించారు.

‘ఆకాశమే హద్దు అనుకుని ధైర్యం, నమ్మకం, మనోబలంతో ముందుకు సాగిన మహిళల కథల్ని సినిమాగా చూపిస్తున్నందుకు ‘మిషన్‌ మంగళ్‌‌’కు సెల్యూట్‌ చేస్తున్నా. బెంగాలీ ప్రోమో చూడండి’ అని ఆయన యూట్యూబ్‌ లింక్‌ను షేర్‌ చేశారు.

దీనికి అక్షయ్‌ రిప్లై ఇచ్చారు.  ‘ధన్యవాదాలు దాదా.. సైన్స్‌ భాష యూనివర్సల్‌. దానికి జాతి, రంగు, హద్దు, లింగ భేదాలు లేవు. సైన్స్‌లో సత్తాచాటిన అద్భుతమైన మహిళలకు ఈ సినిమా అంకితం చేస్తున్నా. ఏదైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించు’ అని ట్వీట్‌ చేశారు.

‘మిషన్‌ మంగళ్‌’ సినిమాలో అక్షయ్‌ ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ పాత్రలో కనిపించనున్నారు. 2013లో భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌‌’ మిషన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. జగన్‌ శక్తి సినిమాకు దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది.