Tollywood: అరుణాచలంలో చెప్పులతో గిరి ప్రదక్షిణ చేసిన స్టార్ నటి.. భక్తుల ఆగ్రహం.. వీడియో వైరల్

ఈ మధ్యన సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా అరుణాచల శివుడిని దర్శించుకుంటున్నారు. ఆ మధ్యన విక్టరీ వెంకటేష్, కిరణ్ అబ్బవరం, అరియానా గ్లోరీ, యాంకర్ లాస్య తదితరులు ఈ శివుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా స్టార్ నటి కూడా అరుణాచలం వెళ్లింది. భర్త తో కలిసి గిరిప్రదక్షిణ చేసింది.

Tollywood: అరుణాచలంలో చెప్పులతో గిరి ప్రదక్షిణ చేసిన స్టార్ నటి.. భక్తుల ఆగ్రహం.. వీడియో వైరల్
Tollywood Actress

Updated on: Mar 29, 2025 | 7:47 PM

తెలిసి చేసిందో, తెలియక చేసిందో కానీ ఈ స్టార్ నటి అనవసరంగా మాటలు పడుతోంది. తన భర్తతో కలిసి పవిత్ర అరుణాచల ఆలయానికి వెళ్లిన ఈ అందాల తార తన భర్తతో కలిసి గిరి ప్రదక్షిణ చేసింది. సూర్యుడు ఉదయించడానికి ముందే సామాన్య భక్తుల్లో కలిసి పోయిన ఈ భార్యాభర్తలిద్దరూ కాలినడకన గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. దారిలో ఎదురయ్యే ఆలయాల దగ్గర ఆగి కొబ్బరికాయలు కొడుతూ ముందుకు నడక సాగించారు. దారి మధ్యలో తమకు ఎదురైన హిజ్రాలతో కూడా నవ్వుతూ ఫొటోలు, సెల్ఫీలు కూడా దిగారు. అంతా బాగుంది కానీ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీళ్లిద్దరూ చెప్పులు, శాండిల్స్‌ ధరించడం వివాదాస్పదమైంది. అంతే నెటిజన్లు ఈ దంపతులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మహా పాపం చేశారంటూ మండిపడుతున్నారు. గతంలో ఏ ఒక్క విషయంలోనూ ఏ ఒక్కరితోనూ మాట పడని ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అనవసరంగా విమర్శలకు గురవుతోంది. ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ స్నేహ.

తాజాా ప్రసన్న, స్నేహ దంపతులు అరుణాచలం వెళ్లారు. అక్కడ భార్యభర్తలిద్దరూ గిరి ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతన్నాయి. అయితే స్నేహ, ప్రసన్న చెప్పలేసుకుని గిరి ప్రదక్షిణ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ‘ ఎంతో పవిత్రమైన అరుణాచల గిరి మార్గంలో చెప్పులు ధరించి స్నేహ, ప్రసన్న భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గిరి ప్రదక్షిణలో స్నేహ, ప్రసన్న దంపతులు.. వీడియో..

అదే సమయంలో మరికొందరు స్నేహ- ప్రసన్న దంపతులుకు మద్దతుగా నిలుస్తున్నారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుందని.. అందువల్ల కొంతమంది చెప్పులు వేసుకుని నడుస్తుంటారని చెబుతున్నారు. చెప్పులు వేసుకోవాలా? వద్దా? అనేది భక్తుల విచక్షణను బట్టి ఉంటుందని, దీనిని తప్పు పట్టాల్సిన అవసరం లేదంటున్నారు.

ఆలయంలో స్నేహ, ప్రసన్న దంపతుల పూజలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.