AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivaji: థియేటర్లలోకి రజినీ సూపర్ హిట్.. ‘శివాజీ..ది బాస్’ రీరిలీజ్.. ఎప్పుడు వస్తుందో తెలుసా ?..

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తలైవా. ఇప్పుడు ఆయన డైరెక్టర్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఫీదరా 170 అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో 171వ చిత్రంలో నటించనున్నారు రజినీ. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది. అదే సంవత్సరంలో దీపావళి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తోన్న లాల్ సలామ్ చిత్రంలో

Shivaji: థియేటర్లలోకి రజినీ సూపర్ హిట్.. 'శివాజీ..ది బాస్' రీరిలీజ్.. ఎప్పుడు వస్తుందో తెలుసా ?..
Sivaji The Boss Movie
Rajitha Chanti
|

Updated on: Nov 05, 2023 | 6:01 PM

Share

ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాల్లో జైలర్ ఒకటి. నెల్సన్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్రం దాదాపు జైలర్ సినిమా 500 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ సక్సెస్‏తో రజినీ ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తలైవా. ఇప్పుడు ఆయన డైరెక్టర్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఫీదరా 170 అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో 171వ చిత్రంలో నటించనున్నారు రజినీ. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది. అదే సంవత్సరంలో దీపావళి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తోన్న లాల్ సలామ్ చిత్రంలో రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమాలో మొయిదీన్ భాయ్ పాత్రలో రజనీ కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

అలా వచ్చే ఏడాది రజనీకాంత్ నటనలో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో రజనీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంలో లాల్ సలామ్ కంటే ముందే రజనీకాంత్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన శివాజీ సినిమా మళ్లీ విడుదల కానుంది. రజనీకాంత్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ ది బాస్ చిత్రం ప్రస్తుతం రీ-రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను రజినీ పుట్టినరోజు డిసెంబర్ 12న కావడంతో.. అంతకంటే ముందే డిసెంబర్ 9న ఈసినిమాను రీరిలిజీ చేయబోతున్నారు. అది కూడా 4K ప్రింట్ లో విడుదల చేయబోతున్నారు. దీంతో తలైవా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా శ్రియా శరణ్ కథానాయికగా నటించగా.. హీరో సుమన్ విలన్ పాత్రలో కనిపించారు. ఇందులో రజిని డిఫరెంట్ మ్యానరిజమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. 2007లో విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.160 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.