Sitara Ghattamaneni: తొలి యాడ్‌కే దిమ్మతిరిగే రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకున్న సితార.. ఎంతంటే
కొంతమంది హీరోయిన్స్ కూడా హీరోలకు తగ్గట్టుగా రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు. అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార కూడా ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే ఓ యాడ్ కూడా చేసింది.
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది రెమ్యునరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. స్టార్ హీరోలు దాదాపు 100 కోట్ల వరకు అందుకుంటున్నారు. అలాగే హీరోయిన్స్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ కూడా హీరోలకు తగ్గట్టుగా రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు. అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార కూడా ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే ఓ యాడ్ కూడా చేసింది. ఈ యాడ్ కు సితారకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ చిన్నదని వయసు తక్కువే అయినా టాలెంట్ గా మాత్రం చాలా ఎక్కువ.. ఇప్పటికే సోషల్ మీడియాలో సితారకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా సితార చేసిన యాడ్ సెన్సషన్ గా మారింది. ఈ యాడ్ ను న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే ఈ యాడ్ కోసం సితార కు అందిన రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ జ్యువెలరీ యాడ్ కోసం సితార ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. మహేష్ బాబు కూడా ఇప్పటికే చాలా యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే.
ఇక సితారకు సోషల్ మీడియాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ సాంగ్ లో నటించింది. సినిమాలో లేకపోయినా.. ఈ మూవీ సాంగ్ లిరికల్ వీడియోలో కనిపించింది సితార. సితార మరిన్ని యాడ్స్ చేస్తారని తెలుస్తోంది.