AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sirivennela Seetharama Sastry: ఇక సెలవు.. అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంతిమయాత్ర..

తెలుగు సాహిత్య సామ్రాట్ సిరివెన్నెల కన్నుమూతతో సినీ పరిశ్రమ మూగబోయింది. ప్రకృతి సైతం మౌనంగా రోదిస్తుంది.

Sirivennela Seetharama Sastry: ఇక సెలవు.. అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంతిమయాత్ర..
Rajeev Rayala
|

Updated on: Dec 01, 2021 | 12:05 PM

Share

Sirivennela Seetharama Sastry: తెలుగు సాహిత్య సామ్రాట్ సిరివెన్నెల కన్నుమూతతో సినీ పరిశ్రమ మూగబోయింది. ప్రకృతి సైతం మౌనంగా రోదిస్తుంది. అనారోగ్యం కారణంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. సీతారామశాస్త్రి మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. తెలుగు కళమ్మతల్లి ఓ కవి పుంగవుడిని కోల్పోయింది. అనారోగ్యంతో సిరివెన్నెల కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంగీత ప్రేమికులు సిరివెన్నెల లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.  ఇక సెలవంటూ వెళ్లిపోయారు సిరివెన్నెల. కొద్దిసేపటి క్రితమే సిరివెన్నెల అంతమయాత్ర మొదలైంది. ఉదయం 5 గంటలనుంచి ఫిలిం నగర్ లోని ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల పార్ధివదేహాన్ని సినీప్రముఖుల, అభిమానుల సందర్శనార్ధం ఉంచారు.

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇక ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియలను తీసుకువెళ్తున్నారు కుటుంబసభ్యులు. సిరివెన్నెల సాహిత్యం ఎన్నో లక్షల గుండెలను కదిలించింది. ఆయ్న పాట ఎన్నో వందల మంది గొంతులో తీణికిసలాడింది. వేలాదిమంది అభిమానుల ఆశ్రునయనాలమధ్య తెలుగు సాహిత్య సారధి సెలవంటూ కదిలారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sirivennela Seetharama Sastry: ‘మీరు కన్ను మూస్తే.. మాకు ఈ ప్రపంచం చీకటయ్యింది…’

Sirivennela Seetharama Sastry: ఆయన సంతకం కోసం ప్రయత్నించా కానీ చివరకు.. భావోద్వేగానికి గురైన రాజమౌళి..

Sirivennela: సాహితీ లోకానికి సిరివెన్నెల మిగిల్చిన చివరి గుర్తులు ఇవే.. సీతరామశాస్త్రి రాసిన చివరి పాట ఏంటో తెలుసా.?