Singer Sunitha: నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవత సునీత గారు.. అభిమాని పోస్ట్ పై సింగర్ ఎమోషనల్..
సింగర్ సునిత.. తన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోశారు. తెలుగు ఇతర భాషలలో ఎన్నో పాటలను ఆలపించిన సునీత.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సింగర్ సునిత.. తన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోశారు. తెలుగు ఇతర భాషలలో ఎన్నో పాటలను ఆలపించిన సునీత.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే సునీతకు అభిమానులు కూడా ఎక్కువే. సింగర్ సునీతకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అభిమానులు ఆమెపై అమితమైన ప్రేమ కనబరుస్తుంటారు. సింగర్ సునీత ఫ్యాన్స్ (ఎస్ఎస్ఎఫ్) పేరుతో సోషల్ మీడియాలో పేజీ కూడా ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో సింగర్ సునీత ఎస్ఎస్ఎఫ్కి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుందని.. తన ప్రాణంతో సమానమని అన్నారు. ఇక ఈ పేజీలో సునీత గురించి ఎన్నో పోస్ట్‌లు వస్తుంటాయి. అయితే ఈ పేజీలో ఇప్పుడు ఓ అభిమాని చేసిన పోస్ట్‌పై సింగర్ సునీత స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
సునీత ఉపద్రష్ట.. ఓ స్పూర్తిప్రదాత అంటూ ఎస్ఎస్ఎఫ్‌లో మెంబర్ అయిన ఇందిరా ప్రియదర్శిని అనే అమ్మాయి తన జీవితం గురించి, తన జీవితంలో సునీత పాత్ర గురించి చెప్పుకొచ్చారు. ” నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవత సునీత గారు.. ఆమె పాట మనస్సుకి ప్రశాంతతనిస్తే.. ఆమె మాట మనిషికి ప్రాణం పోసింది.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఆమె ‘‘అలవాటు’’.. (కుడిచేయితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియనివ్వరు). ఆమెలో ఉన్న ఆత్మ విశ్వాసం నాలో నింపి నేను ఆత్మహత్య చేసుకోకుండా చేసింది.. ఆవిడ పలకరింపు.. (మన సొంత ఇంటి వ్యక్తి కూడా అంత స్వచ్చంగా ఉండదేమో) అప్పుడే పుట్టిన పిల్లల నవ్వులా ఉంటుంది.. ఆవిడ పక్కన ఉంటే ఆమె చుట్టూ ఉండే పాజిటివ్ ఆరానే చెప్ప్తుంది సునీత గారి మనస్సు.. ఆవిడ ఎంతో మందికి ఆదర్శం.. ఆవిడ ఎంతో మందికి ధైర్యం.. ఆవిడ పాట ఎన్నో మనస్సులకి ప్రశాంతత.. ఆవిడ నాకు దేవుడు పంపిన బహుమతి” అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇది చూసిన సింగర్ సునీత కూడా అభిమాని ప్రేమకు ఎమోషనల్ అయ్యారు. తనపై అంత నమ్మకం ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పారు.