Needa Movie: ‘ఆహా’లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. నిజమైన అబద్ధాలను వెంటాడే ‘నీడ’ ప్రేక్షకుల ముందుకు..
ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా'.
ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’. సూపర్ హిట్ సినిమాలతో.. సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌లను అందిస్తున్న ‘ఆహా’.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. అనుక్షణం ఉత్కంఠభరితంగా.. వినోదాన్ని అందించే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘నీడ’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నయనతార, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించగా.. అప్పు ఎన్.భట్టతిరై దర్శకత్వం వహించగా.. జోసెఫ్, అభిజీత్ పిల్లై సంయుక్తంగా నిర్మించారు.
ఈ మూవీని తమిళ్లో ‘నిజల్’ పేరుతో తెరకెక్కించగా.. ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ మధ్యమం నీడ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఈ సినిమా జూలై 23న ఆహాలో వరల్డ్ ప్రీమియర్‌గా రాబోతుంది. ‘ట్రూ లైస్’ ట్యాగ్‌లైన్‌తో తమిళ్లో సూపర్ హిట్‌గా నిలిచింది. నితిన్ అనే చిన్న పిల్లాడి సాయంతో జాన్ అనే న్యాయమూర్తి ఒక హత్య కేసును ఛేదించే నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రానికి ఎస్. కురుప్ సంగీతం అందించారు.
అటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ ‘భుజ్’ ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా ఆగస్టు 13న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన విక్రమార్కుడు, పునర్వవి భూపాలం కీలక పాత్రలో నటించిన ఒక చిన్న విరామం సినిమాలు ఆహాలో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
Kiara Advani: ఏంటమ్మ కియారా ఇలా చేసావు.. తప్పు కదు.. హీరోయిన్‌పై మండిపడుతున్న నెటిజన్లు..