Siddu Jonnalagadda: గొప్ప మనసు చాటుకున్న సిద్దు జొన్నలగడ్డ.. అందరూ హీరోలు ఇలా చేస్తే ఎంత బాగుండు!
టాలీవుడ్ క్రేజీ హీరో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ చేసిన ఒక మంచి పనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ అభిమానులు, నెటిజన్లు ఈ యంగ్ హీరోను తెగ పొగిడేస్తున్నారు. సిద్దూ లాగే మరికొంత మంది హీరోలు ఇలాగే చేస్తే చాలా బాగుంటుందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు సిద్దూ జొన్నల గడ్డ. ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి స్టార్ బాయ్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. అయితే దీని తర్వాత వచ్చిన జాక్ సినిమా మాత్రం సిద్దూను కాస్త వెనక్కు లాగింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ ను అంతగా మెప్పించలేకపోయింది. సిద్దూకు జంటగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన జాక్ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరో సిద్దూ తన గొప్ప మనసును చాటుకున్నాడు. జాక్ సినిమా కోసం అతను సుమారు రూ. 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జాక్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో నిర్మాతను ఆదుకునేందుకు తన వంతు బాధ్యతగా రెమ్యునరేషన్ లో సగం అంటే రూ. 4 కోట్లు వెనక్కు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు స్టార్ బాయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సిద్దూ లాగే ఇతర హీరోలు కూడా ఇలాంటి పనులు చేస్తే నిర్మాతలు మరిన్ని సినిమాలు చేసేందుకు ముందుకు వస్తారంటున్నారు.
థియేటర్లలో ఆడియెన్స్ ను నిరాశపర్చిన జాక్ మూవీ ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో సిద్దూ సినిమాకు భారీ వ్యూస్ వస్తున్నాయి. ఇక జాక్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ తర్వాత చేస్తున్న సినిమా తెలుసు కదా. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్, ప్రమోషనల్ వీడియో అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Star Boy wins hearts once again with an admirable gesture!#SidduJonnalagadda returns half of his remuneration 4 crores to the producer, as his previous film #Jack incurred losses. A true display of commitment and character❤️
His next #TelusuKada releasing on OCT 17th pic.twitter.com/8nUOoz924m
— The Cult Cinema (@cultcinemafeed) June 4, 2025








