Allu Arjun: బెంగుళూరు విజయం.. అల్లు అర్జున్ కొడుకు ఫుల్ ఎమోషనల్..
IPLలో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విజయం సాధించడం, కోహ్లీ ఫ్యాన్స్‌కు పండగే అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్ కూడా ఫుల్ ఖుష్ అయ్యాడు. ఐ లవ్ కోహ్లీ అంటూ ఫిదా అయ్యాడు. నేల మీద పడుకుని, తలపై నీళ్లు పోసుకుని ఎమోషనల్ అయ్యాడు అయాన్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
ఐపీఎల్ ఫైనల్లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో ఎట్టకేలకు ఆర్సీబీ విజయం సాధించింది. దాదాపు 18 ఏళ్లుగా ఎదురుచూసిన IPL టైటిల్ కల సాకారమైంది. దీంతో స్టేడియంలోనే విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఆర్సీబీ విజయంపై సినీతారలు సోషల్ మీడియాలో స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెంగుళూరు టీమ్ విజయం పై స్పందించారు. ఈ క్షణం కోసమే 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. “వెయిట్ ఈజ్ ఓవర్.. ఈసాలా కప్ నమ్దే” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆర్సీబీ మ్యాచ్ గెలిచిన తర్వాత అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఎమోషనల్ అయ్యాడు. అనంతరం చాలా ఫన్నీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తాను కోహ్లీకి వీరాభిమానినని, తలపై వాటర్ బాటిల్ తో నీళ్లు పోసుకుని బెంగుళూరు విజయాన్ని ఎంజాయ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఫుల్లీ ఎమోషనల్ అంటూ రాసుకొచ్చారు బన్నీ.
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?

