AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tillu Square : చెప్పి మరీ కొట్టిన టిల్లుగాడు.. ‘టిల్లు స్వేర్’ బాక్సాఫీస్ మోత.. 9 రోజుల కలెక్షన్స్ ఎన్నంటే..

2022లో విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‏ను షేక్ చేస్తుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 29న గ్రాండ్‏గా రిలీజ్ అయ్యింది. మొదటిరోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా అటు కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.

Tillu Square : చెప్పి మరీ కొట్టిన టిల్లుగాడు.. 'టిల్లు స్వేర్' బాక్సాఫీస్ మోత.. 9 రోజుల కలెక్షన్స్ ఎన్నంటే..
Tillu Square
Rajitha Chanti
|

Updated on: Apr 08, 2024 | 7:33 AM

Share

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ.. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. డీజే టిల్లు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈసినిమాలో నేహాశెట్టి కథానాయికగా నటించింది. 2022లో విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‏ను షేక్ చేస్తుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 29న గ్రాండ్‏గా రిలీజ్ అయ్యింది. మొదటిరోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా అటు కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. మొదటి రోజే రూ. 23 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం తొమ్మిది రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. రిలీజ్ అయి రెండు వారాలు పూర్తిగా కాకుండానే వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటివరకు ఈసినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 101.4 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయిన సమయంలో మరో మూవీ రాలేదు. అలాగే వారం తర్వాత రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్, మంజుమ్మెల్ బాయ్స్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో పాజిటివ్ టాక్ అందుకున్న టిల్లు స్క్వేర్ ఇప్పటివరకు అదే దూకుడు కొనసాగిస్తుంది. ఇక గతంలో సిద్ధూ చెప్పిన కామెంట్ నిజమైందంటూ గుర్తుచేసింది చిత్రయూనిట్. రాబోయే మూడేళ్లలో రూ. 100 కోట్లు కొల్లగొట్టే సినిమా నేను చేయాలి అంటూ డీజే టిల్లు మూవీ టైంలో సిద్దూ చేసిన కామెంట్ మరోసారి గుర్తుచేసింది. అలాగే టిల్లు స్క్వేర్ విడుదల రోజునే ఈ సినిమా రూ. 100 కోట్లు సాధిస్తుందని చెప్పారు ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఇక ముందుగా చెప్పినట్లే తొమ్మిది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది.

ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మురళీధర్ గౌడ్, మురళీ శర్మ, ప్రణీత్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..