అది ప్రభాస్ సినిమా నేను అందులో హీరోయిన్ మాత్రమే.. రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన స్టార్ హీరోయిన్
సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ నటుడు ప్రభాస్. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. కాగా కొవిడ్‌కి ముందు ఏడాదిలో ప్రభాస్ ఒక్క సినిమా మాత్రమే రిలీజయ్యేది. అయితే 2023లో ఆ రూల్ ని బ్రేక్ చేశాడు ప్రభాస్.

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ రెండు బడా సినిమాలతో ఫుల్ ఖుష్ లో ఉన్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సలార్ సినిమాసక్సెస్ ను ఫ్యాన్ ఎంజాయ్ చేసే లోగా కల్కి సినిమాను దింపాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈమూవీ ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇదిలా ఉంటే సలార్ సినిమా గురించి హీరోయిన్ శ్రుతిహాసన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు శ్రుతి సాలిడ్ కౌంటర్ ఇచ్చింది. ఇంటర్వ్యూయర్ మాట్లాడుతూ.. సలార్ సినిమా విజయంలో శ్రుతికి పాత్రకు కూడా తగినంత క్రెడిట్ తీసుకోవాలని సూచించింది. కానీ శ్రుతి దానిని తిరస్కరించారు. అంతే కాదు ఆ రిపోర్టర్ కు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.
“ప్రభాస్ తన కెరీర్‌ను నిర్మించుకోవడానికి చాలా కష్టపడ్డారు, ప్రశాంత్ నీల్ కూడా తన కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఎంతో కృషి చేశారు. వారు సలార్‌కు పునాదులు. నేను సలార్‌లో భాగమైనప్పటికీ, సలార్ సినిమా మొత్తం నా గురించి కాదు. ఇది ప్రభాస్ చిత్రమని నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను అని శ్రుతి చెప్పుకొచ్చింది. ఇది ఓల్డ్ ఇంటర్వ్యూ అయినప్పటికీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ పై శ్రుతి చేసిన కామెంట్స్ ను ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు. హీరోయిన్ అంటే మీలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.