అన్నయ్యపై గుర్రమెక్కి పోజులిస్తోన్న ఈ బుజ్జాయి ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

సినీ సెలబ్రిటీలకు, అభిమానులకు సోషల్ మీడియా ఓ వారధిగా మారింది. లేటెస్ట్ ఫోటోస్ గానీ, వీడియోలు గానీ, మూవీ అప్డేట్స్ అయినా..

అన్నయ్యపై గుర్రమెక్కి పోజులిస్తోన్న ఈ బుజ్జాయి ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2022 | 10:25 AM

సినీ సెలబ్రిటీలకు, అభిమానులకు సోషల్ మీడియా ఓ వారధిగా మారింది. లేటెస్ట్ ఫోటోస్ గానీ, వీడియోలు గానీ, మూవీ అప్డేట్స్ అయినా.. హీరోహీరోయిన్లు ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే వారానికి ఓసారి ఇన్‌స్టాలో లైవ్‌కి వస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ‘త్రోబ్యాక్’ పిక్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి యంగ్ హీరోయిన్ల వరకు అందరి త్రోబ్యాక్ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!

Shriya2

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇంచక్కా తల్లితో కలిసి అన్నయ్యపై గుర్రమెక్కి పోజులిస్తున్న ఈ బుజ్జాయి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని కూతురుతో జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. గుర్తుపట్టేందుకు కొంచెం కష్టంగా ఉందా.? ఈమె తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన ఎన్నో హిట్స్ అందుకుంది. అలాగే యువ హీరోలతో కూడా ఆడిపాడింది. ఇప్పటికీ కుర్రాళ్ళకు హాట్ ఫేవరెట్. ఎవరో కనిపెట్టలేకపోయారా.! అయితే మేమే చెప్పేస్తాం.. ఆమెవరో కాదు శ్రియా శరన్.

Shriya

‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియా.. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సంతోషం’ సినిమాతో తన కెరీర్‌లో మొదటి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి’, ‘నువ్వే..నువ్వే’, ‘ఠాగూర్’, ‘ఛత్రపతి’, ‘శివాజీ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా గమనం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శ్రియా.. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’, ‘నరగసూరాన్’, ‘సందక్కరి’, ‘తడ్కా’ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Shriya1

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ