AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu: ఒకప్పుడు ప్రశాంత్‌ను పురుగులా చూసిన శోభ.. ఇప్పుడు ఓట్ల కోసం

గురువారం ఎపిసోడ్‌లో మరో ఆసక్తికరమైన సీన్ మీరు గమనిస్తే.. శోభాకు ముద్దలు కలిపి అన్నం తినిపిస్తూ ఉంటాడు ప్రశాంత్. అసలు ఇంత బాండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఈ సీన్‌లో ప్రశాంత్‌పై వల్లమాలిన ప్రేమ కనబరిచింది శోభ. ఎందుకు ఇలా అంటున్నామంటే.. తేజ, శోభ చాలా క్లోజ్ కదా.. ఆ విషయం అందరికీ తెలిసిందే.

Bigg Boss Telugu: ఒకప్పుడు ప్రశాంత్‌ను పురుగులా చూసిన శోభ.. ఇప్పుడు ఓట్ల కోసం
Shoba Shetty
Ram Naramaneni
|

Updated on: Nov 03, 2023 | 4:12 PM

Share

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శోభాశెట్టిలో మీరు మార్పును గమనించారా..? ఎదుటి వ్యక్తులకు కనీస గౌరవం ఇవ్వకుండా తన గొంతుతో విరుచుకుపడే ఆవిడ.. ఇప్పుడు పూర్తిగా ట్రాక్ మార్చింది. సీరియల్ బ్యాచ్‌తో మాత్రమే కాకుండా అందరితో కలివిడిగా ఉంటుంది. కారణం ఎలిమినేషన్ భయం. పోయిన వారమే అంచుల వరకు వెళ్లి వచ్చింది. దీంతో తన ఆటిట్యూడ్ కాస్త తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆమెలోని స్వార్థం మాత్రం కనిపిస్తూనే ఉంది. తాజా ఎపిసోడ్‌లో ఆమె ఓ టాస్క్ ఆడి ఓడిపోయింది.  అయినా కానీ ఆమెను టీమ్ సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు. కారణం..  గెలుపు, ఓటములు ఆటలో కామన్ అని అందరికీ తెల్సు. అదే వేరే ఎవరైనా టాస్క్ ఆడటానికి వెళ్లి ఓడిపోతే.. ఆమె అయితే రచ్చ రచ్చ చేసేది. చేత కానప్పుడు ఎందుకు వెళ్లావ్, నీకు అస్సలు సెల్ఫ్ కాన్సిడెన్స్ లేదంటూ నోరేసుకుని పడిపోయేది.

గురువారం ఎపిసోడ్‌లో మరో ఆసక్తికరమైన సీన్ మీరు గమనిస్తే.. శోభాకు ముద్దలు కలిపి అన్నం తినిపిస్తూ ఉంటాడు ప్రశాంత్. అసలు ఇంత బాండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఈ సీన్‌లో ప్రశాంత్‌పై వల్లమాలిన ప్రేమ కనబరిచింది శోభ. ఎందుకు ఇలా అంటున్నామంటే.. తేజ, శోభ చాలా క్లోజ్ కదా.. ఆ విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఒకసారి తేజ ముద్దలు కలిపి తినిపించబోతే.. తనకు వద్దని ఖరాఖండిగా చెప్పేసింది. ముఖం అంతా చిరాగ్గా పెట్టింది. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్ పెట్టిన ముద్దలను అమృతం మాదిరిగా కలరింగ్ ఇచ్చింది. గతంలో ఎవరికీ ఇలా పెట్టలేదని కన్ఫామ్ చేసుకుని.. ఇది తనకు లైఫ్‌లో గుర్తుండిపోయే సిట్యువేషన్ అని ఓ స్టేట్మెంట్ పాస్ చేసింది. కేవలం ఓట్ల కోసమే శోభ ఈ ట్రిక్ ప్లే చేసింది. అంతేకాదు అంత బాండింగ్ వారి మధ్య ఏం లేదు. పైగా తొలినాళ్లలో ప్రశాంత్‌ను శోభ ఎంత చిన్నచూపు చూసిందో అందరికీ తెలిసిందే.

ఈ 65 రోజుల వ్యవధిలో శోభ గురించి జనాలు అంతా తెలుసుకున్నారు. ఆమె వేసే ఎత్తులు, పై ఎత్తులు అర్థం చేసుకోనంత పిచ్చోళ్లా ఆడియెన్స్ చెప్పండి. కేవలం ప్రశాంత్ ఫాలోయింగ్ ఉన్న పర్సన్. అతనికి విపరీతమైన ఓటింగ్ ఉందని ఓ క్లారిటీ ఉంది. ప్రజంట్ అతను నామినేషన్స్‌లో లేడు. దీంతో నాలుగు ఓట్లు తనకు పడాతాయ్ అని.. నెగెటివిటీ తగ్గుతుంది అని మిస్ శోభా శెట్టి ఇలా ప్రవర్తించినట్లు అందరికీ అర్థం అయ్యింది. ఈమెను బయటకు పంపాలని బయట వీక్షకులు బలంగా డిసైడ్ అయ్యారు. లెట్స్ సీ ఏం జరుగుతుందో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే