Adavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్.. అతిథులుగా ఆ స్టార్ హీరోయిన్స్.. లైవ్ మీకోసం..
టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand).. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu).
టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand).. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ తిరుమల కిశోర్ దర్శకత్వం వహించారు. ఇందులో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశి కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. మరోవైపు ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాని ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మార్చి 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా.. ఈరోజు (ఫిబ్రవరి 27న) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు మేకర్స్.
ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ సుకుమార్.. కీర్తి సురేష్, సాయి పల్లవి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శిల్పా కళా వేదికలో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకను టీవీ 9లో ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.
Also Read: Prudhvi Raj: భీమ్లా నాయక్ సినిమాపై పృథ్వీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ విషయంలో బాధగా ఉందంటూ..
Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో సలార్ చిత్రయూనిట్..
Chiranjeevi : గ్యాంగ్‌లీడర్ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌తో రానున్న మెగాస్టార్..?