Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్ళు మీకు జోహార్లు ఓటీటీ రిలీజ్ వాయిదా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
యంగ్ హీరో శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శర్వాకు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించింది
యంగ్ హీరో శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు(Aadavallu Meeku Johaarlu)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శర్వాకు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించింది. తన కుటుంబంలోని 10 మంది మహిళా సభ్యుల అంగీకారం పొందడం అంత సులభం కాదు. కాబట్టి, పెళ్లికి సరైన అమ్మాయిని వెతకడం అతనికి చాలా కష్టమనిపిస్తుంది. అదే సమయంలో రష్మిక హీరోకి పరిచయం అవుతుంది. అయితే, కథలో ట్విస్ట్ ఏమిటంటే, మన పెళ్లి జరగదు అని హీరోయిన్ చెప్పడం ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. తిరుమల కిషోర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వర్కబుల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. శర్వానంద్, రష్మిక మందన్న కెమిస్ట్రీ ఆకట్టుకుంది. సుజిత్ సారంగ్ కెమెరా పనితనం ఆకర్షణీయంగా వుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించారు. ఆడవాళ్ళు మీకు జోహార్లు అనేది అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
ఆడవాళ్ళు మీకు జోహార్లు ఫిబ్రవరి 25నే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తొలిరోజే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. రూ.16.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. లాంగ్ రాన్లో కేవలం రూ. 7.72 కోట్ల షేర్ను మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో అలరించడానికి రెడీ అయ్యింది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 2 (నేడు )ఉగాది పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ ఓటీటీ రిలీజ్ ను వాయిదా వేశారు. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాను ఏప్రిల్ 14న డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 14న ఈ సినిమాను సోనీ లివ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :