AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dunki Movie : రిలీజ్ దగ్గరపడుతున్న టైంలో ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న టాక్..

ఇప్పుడు డ్రాప్ 5ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు షారుఖ్సి అభిమానులను టెన్షన్ని పెడుతోంది. సినిమాకు విడుదలకు ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉండగా ప్రస్తుతం చిత్రబృందం షూటింగ్ జరుపుకుంటోందని తెలుస్తోంది.

Dunki Movie : రిలీజ్ దగ్గరపడుతున్న టైంలో ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న టాక్..
Dunki movie twitter review
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2023 | 9:07 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘ డంకి ‘ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ వైరల్‌గా మారాయి. అవి డ్రాప్ 1, డ్రాప్ 2, డ్రాప్ 3, డ్రాప్ 4గా  విడుదలయ్యాయి. ఇప్పుడు డ్రాప్ 5ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు షారుఖ్సి అభిమానులను టెన్షన్ని పెడుతోంది. సినిమాకు విడుదలకు ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉండగా ప్రస్తుతం చిత్రబృందం షూటింగ్ జరుపుకుంటోందని తెలుస్తోంది.

పఠాన్, జవాన్ చిత్రాల విజయాల జోరు మీదున్న బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం “డంకీ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న డంకీ డిసెంబర్ 21న విడుదల కానుండగా, ఇప్పటికే ట్రైలర్ తోనే ఈ సినిమా పై అంచనాలు పెంచేసింది. డంకీ డ్రాప్-4 తర్వాత డంకీ డ్రాప్-5ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. మహిరే అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ‘డంకీ’ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ నంబర్ షూటింగ్ ఇటీవల అబుదాబిలో జరుగుతుందని తెలుస్తోంది. తన కుమార్తె సుహానా ఖాన్ కొత్త సినిమా ప్రీమియర్ తర్వాత, షారుక్ ఖాన్ UAEకి వెళ్లి అక్కడ టీమ్ ను కలిశాడు. మూడు రోజుల పాటు ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారట. రిలీజ్ దగ్గర పడుతున్న టైం లో ఇంకా షూటంగ్ జరుపుకోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

‘డంకీ’ చిత్రంలో షారుక్‌తో పాటు నటి తాప్పీ పన్ను ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విక్కీ కౌశల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో బొమన్ ఇరానీతో పాటు మరికొందరు ముఖ్య నటీనటులు నటించారు. అక్రమంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే వలసదారుల కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డంకీ’. అక్రమంగా లండన్‌కు వలస వచ్చిన నలుగురు స్నేహితుల కథే ‘డంకీ’ సినిమా. సంజు సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో డంకి పై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. షారూఖ్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ , జియో సినిమాస్ యాజమాన్యంలోని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ డంకీని నిర్మించారు.

ఈ ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన రెండు సినిమాలు ఇప్పటికే విడుదల కాగా, ఈ ఏడాది విడుదల కానున్న షారుఖ్ ఖాన్ మూడో సినిమా ‘డంకీ’. గతంలో విడుదలైన ‘పఠాన్‌’, ‘జవాన్‌’ రెండూ సూపర్‌ డూపర్‌ హిట్‌ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ‘డంకీ’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపబోతోందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..