Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal : యానిమల్‌లో ఆ పాత్రను సారా అలీఖాన్ మిస్ చేసుకుందా..? అసలు విషయం ఏంటంటే

‘యానిమల్’ సినిమాలో ఇంటిమేట్ సీన్స్, వివాదాస్పద డైలాగ్స్ పై ఇప్పటికే పలు విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రణబీర్, నటి త్రిప్తి దిమ్రీ మధ్య ఇంటిమేట్ సీన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే త్రిప్తి దిమ్రీ కూడా ఈ సీన్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంటిమేట్ సీన్స్ ఎలా షూట్ చేశారో కూడా చెప్పింది.

Animal : యానిమల్‌లో ఆ పాత్రను సారా అలీఖాన్ మిస్ చేసుకుందా..? అసలు విషయం ఏంటంటే
Animal
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 11, 2023 | 9:45 AM

ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ దూసుకుపోతున్న సినిమా యానిమల్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విషయంలోనూ  దుమ్మురేపుతోంది. ‘యానిమల్’ సినిమాలో ఇంటిమేట్ సీన్స్, వివాదాస్పద డైలాగ్స్ పై ఇప్పటికే పలు విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రణబీర్, నటి త్రిప్తి దిమ్రీ మధ్య ఇంటిమేట్ సీన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే త్రిప్తి దిమ్రీ కూడా ఈ సీన్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంటిమేట్ సీన్స్ ఎలా షూట్ చేశారో కూడా చెప్పింది. అలాగే ఇలాంటి సీన్స్ లో నటించడానికి తాను రెడీగా ఉన్నట్టు కూడా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు యానిమల్ గురించిన ఓ వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఒకరైన సారా అలీ ఖాన్ ‘యానిమల్’ చిత్రంలో ఒక ఇంటిమేట్ సన్నివేశం కోసం ఆడిషన్ చేసినట్లు బీ టౌన్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దాంతో ప్రస్తుతం ‘యానిమల్’ సినిమాలో సారా అలీఖాన్, ఇంటిమేట్ సీన్ గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. ‘యానిమల్’ సినిమాలో సారా అలీఖాన్ ఇంటిమేట్ సీన్ కోసం ఆడిషన్ చేయగా, ఆమెను రిజక్ట్ చేశారని టాక్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సారా నటన నచ్చలేదు, కాబట్టి అతను ఈ చిత్రంలో జోయా పాత్రను పోషించడానికి త్రిప్తిని ఎంచుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

అయితే  సారా అలీఖాన్ ఈ సినిమా కోసం ఆడిషన్ చేయలేదట.  ‘యానిమల్’ సినిమాకు సారా అలీఖాన్‌కి ఎలాంటి సంబంధం లేదన్న తెలుస్తోంది. ఇవన్నీ కేవలం పుకార్లే అని తెలుస్తోంది. యానిమల్ సినిమాలో తృప్తిది చాలా చిన్న పాత్ర. కానీ ఎక్కడ చూసినా తృప్తి, రణ్‌బీర్‌ల ఇంటిమేట్ సీన్స్ మాత్రమే చర్చనీయాంశమయ్యాయి. ‘యానిమల్‌’ సినిమా తర్వాత త్రిప్తి పాపులారిటీ కూడా బాగా పెరిగింది. అంతేకాదు సోషల్ మీడియాలో తృప్తికి ఫాలోవర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు. ఇక ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 400 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 600 కోట్ల వరకు వసూల్ చేసిందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.