Allu Ayaan-Shah Rukh Khan: అల్లు అయాన్ పాటకు షారుఖ్ ఫిదా.. తన పిల్లలు ఆ సాంగ్ ప్రాక్టీస్ అవుతారట..
ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలోని 'లుట్ పుట్ గయా..' అనే పాటను ఎంతో అందంగా పాడాడు . అయాన్ పాడుతున్న వీడియోను స్నేహ తన ఇన్ స్టా స్టారీలో షేర్ చేయగా.. ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేశారు ఫ్యాన్స్. ఎప్పుడూ అల్లరి పనులతో నవ్వులు పూయించే అయాన్.. ఈసారి లుట్ పుట్ గయా అంటూ అందంగా పాడి అందరిని ఆకట్టుకున్నాడు. ఎంతో ముద్దుగా.. క్యూట్ గా పాడాడంటూ నెటిజన్స్, సినీ ప్రముఖులు అయాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
అల్లు అయాన్.. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బన్నీ తనయుడి అల్లరి చేష్టలకు నెటిజన్స్ ఫిదా అవుతుంటారు. అయాన్.. మోడల్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఇంట్లో తన తండ్రి.. చెల్లెలు అర్హతో కలిసి అయాన్ సరదాగా ఎంజాయ్ చేస్తున్న వీడియోస్, ఫోటోస్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు బన్నీ సతీమణి స్నేహరెడ్డి. ఇక ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలోని ‘లుట్ పుట్ గయా..’ అనే పాటను ఎంతో అందంగా పాడాడు . అయాన్ పాడుతున్న వీడియోను స్నేహ తన ఇన్ స్టా స్టారీలో షేర్ చేయగా.. ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేశారు ఫ్యాన్స్. ఎప్పుడూ అల్లరి పనులతో నవ్వులు పూయించే అయాన్.. ఈసారి లుట్ పుట్ గయా అంటూ అందంగా పాడి అందరిని ఆకట్టుకున్నాడు. ఎంతో ముద్దుగా.. క్యూట్ గా పాడాడంటూ నెటిజన్స్, సినీ ప్రముఖులు అయాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు అయాన్ వీడియోపై షారుఖ్ స్పందించాడు.
తన సినిమాలోని పాటను అయాన్ పాడడం చూసి ఫిదా అయ్యాడు షారుఖ్. అయాన్ పాడుతున్న వీడియోను షారుఖ్ ఖాన్ ఫ్యాన్ పేజీ షేర్ చేస్తూ.. అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ షారుఖ్ సాంగ్ పాడాడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనికి షారుఖ్ రిప్లై స్తూ.. ‘థాంక్యూ లిటిల్ వన్.. ఫ్లవర్, ఫైర్ రెండూ ఒకేదాంట్లో చూపించావు. ఇప్పుడు నా పిల్లలు శ్రీవల్లి పాటను ప్రాక్టీస్ చేస్తారు’ అంటూ అల్లు అర్జున్ ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం షారుఖ్ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. ఇక షారుఖ్ ట్వీట్ కు బన్నీ రిప్లై ఇచ్చాడు. ‘షారుఖ్ జీ.. సో స్వీట్ ఆఫ్ యు.. మీ స్వీట్ మెసేజ్ కు థాంక్యూ.. లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ కామెంట్ చేశాడు. షారుఖ్, బన్నీ ట్విట్టర్ ముచ్చట చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వీరిద్దరి ట్వీట్స్ ను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.
ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయిన అయాన్.. ఇప్పుడు నార్త్ లోనూ మరింత పాపులర్ అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తుండగా.. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Shah Rukh ji … soo sweet of you . Humbled by your sweet msg . Lots of love 🖤🙏🏽
— Allu Arjun (@alluarjun) February 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.