Uma Maheswari: నందమూరి కుటుంబంలో విషాదం.. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య
నందమూరి కుటుంబంలో విషాదం. దివంగత నటుడు నందమూరి తారకరామారావు కూతురు ఉమామహేశ్వరి తిది శ్వాస విడిచారు. ఉమామహేశ్వరి హఠాన్మరణంతో నందమూరి ఎన్టీఆర్ కుటుంబసభ్యుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
నందమూరి కుటుంబంలో విషాదం. దివంగత నటుడు నందమూరి తారకరామారావు కూతురు ఉమామహేశ్వరి( Uma Maheswari) తుది శ్వాస విడిచారు. ఉమామహేశ్వరి హఠాన్మరణంతో నందమూరి ఎన్టీఆర్ కుటుంబసభ్యుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. . ఆమె మరణ వార్త తెలిసి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఆమె ఇంటికి తరలి వెళ్తున్నారు. ఉమామహేశ్వరి హఠాన్మరణంతో నందమూరి అభిమానుల్లో విషాదంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. ఉమామహేశ్వరి మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఎన్టీఆర్‌కు ఉమామహేశ్వరి ఆఖరి కుమార్తె .. ఆమె మరణంతో తీవ్ర విషాదంలో ఎన్టీఆర్ కుటుంబం ఉంది.
ఉమామహేశ్వరీ మానసిక ఒత్తిడి కారణంగా ఉమామహేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. బాలకృష్ణ, చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పటికే వచ్చారు. విదేశాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కి సమాచారం అందించారు. ఉమామహేశ్వరి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించనున్నారు.. ఎన్టీఆర్ చివరి కూతురు. ఎన్టీఆర్ కూతుర్లలో దగ్గుపాటి పురంధేశ్వరి ఒకరు. ఆమె రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే రెండో కూతురు చంద్రబాబు నాయుడు భార్య అయినా భువనేశ్వరి, మరొక కూతురు లోకేశ్వరి, ఇక చివరి కూతురు, చిన్న కూతురు ఉమామహేశ్వరి. ఇటీవలే ఉమామహేశ్వర కుమార్తె పెళ్లి జరిగింది. ఆ నిశ్చితార్ధ సమయంలోనే చాలా రోజుల తర్వాత చంద్రబాబు దగ్గుబాటి కలిశారు. ప్రస్తుతం ఆమె పార్థివదేహం ఇంట్లోనే సందర్శనకు ఉంచారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, పలువురు ప్రముఖులు విచ్చేయనున్నారు. పలువురు ఉమామహేశ్వరి మృతిపై సంతాపం తెలుపుతున్నారు.