Karthika: సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న రాధ కూతురు కార్తీక‌.. సినిమాల‌కు గుడ్‌బై చెప్పి ఏం చేయ‌నుందంటే..

Karthika: నాగ‌చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన జోష్ చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంది సీనియ‌ర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక‌. కో అనే చిత్రంతో త‌మిళంలో న‌టించిన ఈ చిన్న‌ది అన‌తి కాలంలోనే ద‌క్షిణాదికి చెందిన అన్ని భాష‌ల్లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. అయితే...

Karthika: సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న రాధ కూతురు కార్తీక‌.. సినిమాల‌కు గుడ్‌బై చెప్పి ఏం చేయ‌నుందంటే..
Karthika
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 24, 2021 | 8:55 PM

Karthika: నాగ‌చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన జోష్ చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంది సీనియ‌ర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక‌. కో అనే చిత్రంతో త‌మిళంలో న‌టించిన ఈ చిన్న‌ది అన‌తి కాలంలోనే ద‌క్షిణాదికి చెందిన అన్ని భాష‌ల్లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. అయితే కెరీర్‌లో చాలా త‌వ‌క్కువ విజ‌యాల‌ను అందుకున్న కార్తీక ఏడేళ్ల‌లో 10 సినిమాల్లో న‌టించింది. కేవ‌లం సినిమాల‌కు ప‌రిమితం కాకుండా కార్తీక హిందీలో ఓ సీరియల్‌లోనూ న‌టించింది.

2016లో వ‌చ్చిన వా దీల్ అనే త‌మిళ సినిమాలో న‌టించిన‌ కార్తీక‌.. మ‌రో సినిమాలో క‌నిపించ‌లేదు. దీంతో కార్తీక కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌ట్లో అవ‌కాశాలు వ‌చ్చేలా లేవ‌ని భావించిందేమో కానీ.. కార్తీక సినిమాల‌కు గుడ్ బై చెప్పే యోజ‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం యూటీఎస్ గ్రూప్ ఆఫ్ హోట‌ల్స్‌కు డైరెక్టర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కార్తీక ఇక‌పై అదే ప‌నిని కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌పై మ‌రోసారి సినిమాల్లో న‌టించే ఆలోచ‌న‌లో లేన‌ట్లు కార్తీక డిసిజ‌న్ తీసుకుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌టన వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Sonu Supermarket : సూపర్ మార్కెట్ ఓపెన్ చేసిన సోనూ సూద్ .. బ్రెడ్డు, గుడ్డు అన్నీ హోమ్ డెలివరీనే.. చార్జీలు అదనం

Nivetha Pethuraj: భోజనంలో బొద్దింక; రెస్టారెంట్ పై స్విగ్గీకి ఫిర్యాదు చేసిన తమిళ హీరోయిన్!

Vijayashanti Birthday: రాముల‌మ్మ‌కు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు తెలిపిన సూప‌ర్ స్టార్‌.. స్పందించిన విజ‌య‌శాంతి..