Nagma: ఇన్నాళ్ళకు ఈ సీనియర్ హీరోయిన్‌కు పెళ్లి పై గాలి మళ్లింది..
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న నగ్మా ఆతర్వాత తన స్నేహితురాలు దివ్యభారతి కోరిక మేరకు సౌత్ లో సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. చిరంజీవితో ఘరానా మొగుడు, అక్కినేని నాగార్జునతో అల్లరి అల్లుడు లాంటి సినిమాలు చేసింది. అలాగే సీనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నగ్మా. అలాగే తమిళ్ లో రజినీకాంత్తో "భాషా", 1994లో ప్రభుదేవాతో "కదలన్" చిత్రాలు చేసింది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ప్రేక్షకులను అలరించిన వారిలో నగ్మా ఒకరు. బాగీ: ఎ రెబల్ ఆఫ్ లవ్ అనే హిందీ సినిమాతో కెరీర్ ను ప్రారంభించింది ఈ అందాల భామ. ఈ సినిమాలో ఆమె సల్మాన్ ఖాన్ కు జోడీగా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది ఈ భామ. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న నగ్మా ఆతర్వాత తన స్నేహితురాలు దివ్యభారతి కోరిక మేరకు సౌత్ లో సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. చిరంజీవితో ఘరానా మొగుడు, అక్కినేని నాగార్జునతో అల్లరి అల్లుడు లాంటి సినిమాలు చేసింది. అలాగే సీనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నగ్మా. అలాగే తమిళ్ లో రజినీకాంత్తో “భాషా”, 1994లో ప్రభుదేవాతో “కదలన్” చిత్రాలు చేసింది.
అంతే కాదు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా అందుకున్నారు నగ్మా. ప్రస్తుతం నగ్మా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నగ్మా మాట్లాడుతూ.. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపారు.
View this post on Instagram
నగ్మా వయసు ప్రస్తుతం 48 ఈ వయసులో ఆమెకు పెళ్లిపై గాలి మళ్లింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఓ తోడు, పిల్లలు కావాలని ఉంది అని తెలిపింది. పెళ్లి చేసుకోకూడదన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. పెళ్లి ద్వారా ఒక ఫ్యామిలీని ఏర్పరచుకోవాలని ఉంది.
View this post on Instagram
త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో చూడాలి అంటూ చెప్పుకొచ్చింది నగ్మా. దాంతో నగ్మా పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో నగ్మా కొంతమంది హీరోలతో లవ్ ఎఫైర్స్ నడిపారని టాక్ ఉంది. ఈ వయసులో పెళ్లి ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఏఈ సీనియర్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.