AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9కోట్ల అఫర్ ను రిజక్ట్ చేసిన నాగ చైతన్య.. నువ్వు గ్రేట్ బాసు అంటున్న ఫ్యాన్స్

జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య సినిమా సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ హీరోగా రాణిస్తున్నాడు. మొన్నామధ్య బంగార్రాజు, లవ్ స్టోరీ సినిమాలతో హిట్స్ అందుకున్న నాగ చైతన్య. ఆ తర్వాత లాల్ సింగ్ చద్దా, థాంక్యూ సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్నారు. ఆతర్వాత భారీ ఆశలు పెట్టుకున్న కస్టడీ సినిమా కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మత్యకారుల జీవిత నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా కోసం వర్క్ షాప్ కూడా మొదలు పెట్టారు.

9కోట్ల అఫర్ ను రిజక్ట్ చేసిన నాగ చైతన్య.. నువ్వు గ్రేట్ బాసు అంటున్న ఫ్యాన్స్
Naga Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 01, 2023 | 8:20 AM

అక్కినేని యంగ్ హీరోలకు ఈ మధ్య టైం కలిసి రావడంలేదు. సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నారు అక్కినేని హీరోలు. యువ సామ్రాట్ నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకుంటున్నారు. జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య సినిమా సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ హీరోగా రాణిస్తున్నాడు. మొన్నామధ్య బంగార్రాజు, లవ్ స్టోరీ సినిమాలతో హిట్స్ అందుకున్న నాగ చైతన్య. ఆ తర్వాత లాల్ సింగ్ చద్దా, థాంక్యూ సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్నారు. ఆతర్వాత భారీ ఆశలు పెట్టుకున్న కస్టడీ సినిమా కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మత్యకారుల జీవిత నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా కోసం వర్క్ షాప్ కూడా మొదలు పెట్టారు.

ఇదిలా ఉంటే నాగ చైతన్య ఓ భారీ ఆఫర్స్ ను రిజక్ట్ చేశారని టాక్ వినిపిస్తుంది. నాగచైతన్య ఏకంగా 9 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఓ సినిమాలో స్పెషల్ రోల్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ నాగ చైతన్యకు ఈ ఆఫర్ ను ఇచ్చిందట.

అయితే ఈ ఆఫర్ ను నాగ చైతన్య సున్నితంగా తిరస్కరించారట. రోజుకొక కోటి రూపాయల చొప్పున తొమ్మిది రోజులకు గాను 9 కోట్లు ఆఫర్ చేశారట.. అయినా కూడా నాగ చైతన్య నో చెప్పారట. రెమ్యునరేషన్ ఎక్కువగా వచ్చినా కూడా సంతృప్తి దక్కడంలేదట.. దాంతోనే నాగ చైతన్య ఈ ఆఫర్ ను రిజక్ట్ చేశారట. దాంతో ఫ్యాన్స్ నాగ చైతన్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక నాగ చైతన్య నెక్స్ట్ సినిమాతో భారీ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. చందు మొండేటి నాగ చైతన్య కాంబోలో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అక్కినేని ఫ్యాన్స్.

నాగ చైతన్య ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'మీ ఆనందం కోసం మా కొడుకును జోకర్ చేస్తారా': సంజన గణేషన్
'మీ ఆనందం కోసం మా కొడుకును జోకర్ చేస్తారా': సంజన గణేషన్
మే 1 నుంచి కొత్త రూల్‌.. వారు స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించలేరు
మే 1 నుంచి కొత్త రూల్‌.. వారు స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించలేరు
ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?