Actress Urvashi: సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా..? హీరోయిన్‍గా ఎంట్రీకి రెడీ..

సమంత నటించిన ఓ బేబీ సినిమాలో రాజేంద్రప్రసాద్ మరదలిగా కనిపించి నవ్వులు పూయించింది. అలాగే శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలోనూ కీలకపాత్ర పోషించింది. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తుంది.

Actress Urvashi: సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా..? హీరోయిన్‍గా ఎంట్రీకి రెడీ..
Urvashi
Follow us

|

Updated on: May 07, 2024 | 5:23 PM

ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్‏గా అలరించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బిజీగా ఉన్నవారిలో ఊర్వశి ఒకరు. ఇప్పటి ప్రేక్షకులకు ఈ పేరు అంతగా తెలియదు.. కానీ ఆమె తెరపై కనిపిస్తే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. తల్లి, పిన్ని పాత్రలలో అనేక చిత్రాల్లో నటించి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో రాజేంద్రప్రసాద్ మరదలిగా కనిపించి నవ్వులు పూయించింది. అలాగే శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలోనూ కీలకపాత్ర పోషించింది. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తుంది.

ఇదిలా ఉంటే.. ఊర్వశి గురించి మాత్రమే ఈ ప్రపంచానికి ఎక్కువగా తెలుసు. ఆమె కుటుంబం, పిల్లలు ఎప్పుడూ బయట కనిపించరు. కానీ ఇప్పుడు ఊర్వశి కూతురు కుంజత.. తేజ లక్ష్మి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. త్వరలోనే తేజ లక్ష్మీ హీరోయిన్‎గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఊర్వశి తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో ఊర్వశి తన కూతురు తేజ లక్ష్మితో ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ తన కూతురు తేజ లక్ష్మి త్వరలోనే సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టనుందని తెలిపింది. ఇప్పటికే సినిమా కథలను వింటుందని చెప్పుకొచ్చింది. ఊర్వశి 2000లో కేరళ నటుడు మనోజ్ జైన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి తేజ లక్ష్మి జన్మించగా.. 8 ఏళ్ల తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2013లో ఊర్వశి శివప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి బాబు ఇషాన్ జన్మించాడు. ప్రస్తుతం ఊర్వశి తెలుగు, తమిళం చిత్రాల్లో బిజీగా ఉంది. అయితే ఇన్ స్టాలో వైరలవుతున్న ఫోటోస్ చూస్తుంటే ఊర్వశి కూతురు తేజ లక్ష్మి, కుమారుడు ఇషాన్ ఓ సినిమా సెట్ లో సందడి చేసినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ