ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు.. మనసులో మాట చెప్పిన రమ్యకృష్ణ
తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రమ్యకృష్ణ. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ. తెలుగు, తమిళ్ భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది.

ప్రముఖ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.. ఇప్పటికీ తన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాహుబలి విడుదలైన తర్వాత పాత్రల ఎంపికలో మార్పు వచ్చిందా అని అడగగా, తాను ఎప్పుడూ ఒకేలా పాత్రలను ఎంపిక చేసుకుంటానని, అయితే బాహుబలి తర్వాత వచ్చిన అవకాశాలలో ప్రభావం తప్పకుండా ఉంటుందని రమ్యకృష్ణ అన్నారు. శివగామి పాత్ర తన కెరీర్‌కు ఎనలేని గుర్తింపును, ప్రజాదరణను తెచ్చిందని ఆమె అన్నారు. బాహుబలి టీమ్‌తో ఐదేళ్ల అనుబంధం చాలా ప్రత్యేకమని, అది కేవలం ఒక సినిమా హిట్ కావడం కంటే గొప్పదని రమ్యకృష్ణ భావించారు. రమ్యకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, అఖిల్, నాగచైతన్యలతో కలిసి పనిచేశారు.
ఇది కూడా చదవండి : వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
అక్కినేని కుటుంబంతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ.. గత జన్మలోనూ వారితో కలిసి ఉండి ఉంటానని, పరిశ్రమలో వారితో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. నాగార్జున, అఖిల్, నాగచైతన్యలలో మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్‌లో కొన్ని సిమిలారిటీలు ఉన్నాయని.. నాగార్జునతో తన తొలి చిత్రం సంకీర్తన తన హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుందని, ఆ తర్వాత హలో బ్రదర్, అన్నమయ్య, క్రిమినల్ వంటి విజయవంతమైన చిత్రాలు చేశారని గుర్తుచేసుకున్నారు. నాగార్జున రొమాంటిక్ స్టైల్‌ను ఎవరూ అందుకోలేరని, అయితే అఖిల్, చైతన్యలలో కూడా ఆ రొమాంటిక్ యాంగిల్ ఉందని ఆమె పేర్కొన్నారు. నేటితరం నటీనటులు ఒత్తిడిని ఎలా ఎదుర్కుంటారు అని అడగగా, నేటితరం వారికి పరిశ్రమ గురించి మంచి అవగాహన ఉందని, విజయం, అపజయాలను ఎదుర్కొనే శక్తి వారికి ఉందని రమ్యకృష్ణ అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి :OTT Movie: ఇది కదా సినిమా అంటే.. ఇండియాలోనే నెంబర్ 1.. రొమాంటిక్ ఎంటర్టైనర్
తన జనరేషన్‌లో నటీమణులకు తమను తాము నిరూపించుకోవడానికి అన్ని రకాల పాత్రలు లభించేవని, అయితే ఇప్పుడు వేగం పెరిగిందని, తప్పులు చేసి నేర్చుకునేంత సమయం లేదని ఆమె అన్నారు. యాక్టింగ్ తన జీవితంలో ఎంతో ముఖ్యమని, పెళ్లైన తర్వాత నటనకు దూరం కావడం అరుదు అని, నేటితరం నటీనటులు పని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారని రమ్యకృష్ణ అన్నారు. తనకు పని దక్కడం అదృష్టమని, యాక్టింగ్ తనను విడిచిపెట్టలేదని ఆమె అన్నారు. తన కెరీర్‌లో కే. రాఘవేంద్రరావు , కే.ఎస్. రవికుమార్ వంటి దర్శకులు ముఖ్యులు అని రమ్యకృష్ణ పేర్కొన్నారు. రాఘవేంద్రరావు తర్వాత కే.ఎస్. రవికుమార్ తనకు పడయప్ప (నరసింహ), పంచతంత్రం వంటి చిత్రాలతో తమిళంలో గొప్ప విజయాన్ని అందించారని తెలిపారు. తన ప్రతి పాత్రకు వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని, అదే తన బలమని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.




