AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Nair: ‘నా కూతురు కార్తీకకు ప్రమోషన్ వచ్చింది’.. గుడ్ న్యూస్ చెప్పిన సీనియర్ నటి రాధ.. శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్యాన్స్..

కార్తీక నాయర్ 2009లో జోష్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీలో కార్తీక తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి అలరించింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాలు కార్తీకకు గుర్తింపు తీసుకువచ్చాయి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఆ తర్వాత 2011లో దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన గో చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టింది.

Karthika Nair: 'నా కూతురు కార్తీకకు ప్రమోషన్ వచ్చింది'.. గుడ్ న్యూస్ చెప్పిన సీనియర్ నటి రాధ.. శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్యాన్స్..
Karthika Nair, Radha
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2024 | 6:17 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ రాధ. 80, 90’sలలో దక్షిణాదిలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఇక ఆ తర్వాత ఆమె కూతురు కార్తీక నాయర్ 2009లో జోష్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీలో కార్తీక తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి అలరించింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాలు కార్తీకకు గుర్తింపు తీసుకువచ్చాయి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఆ తర్వాత 2011లో దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన గో చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టింది. అయితే అందం, అభినయంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కార్తీకకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారరంగంలో బిజీ అయ్యింది.

ఇదిలా ఉంటే.. కార్తీక గతేడాది నవంబర్ లో తన బాయ్ ఫ్రెండ్ రోహిత్ మీనన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుకకు సౌత్ ఇండస్ట్రీలోని సీనియర్ నటీనటులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక తాజాగా తన కూతురు కార్తీక ప్రమోషన్ పొందింది అంటూ గుడ్ న్యూస్ పంచుకున్నారు సీనియర్ హీరోయిన్ రాధ.. పెళ్లైన రెండు నెలలకే తన కూతురికి ప్రమోషన్ వచ్చిందంటూ ఇన్ స్టాలో షేర్ చేశారు.

“నా కుమార్తెను కొత్తగా పెళ్లయిన మహిళగా చూడడం ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఇక ఇప్పుడు ఈ కొత్త కోడలు కుటుంబానికి పెద్ద కోడలుగా ప్రమోషన్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు నా కూతురు పెద్ద కోడలు అయ్యింది. తమ ఇంట్లోకి మరో కొత్త కోడలు వచ్చింది.. వారికి అభినందనలు” అంటూ రాసుకొచ్చింది రాధ. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. కార్తీకకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్..

View this post on Instagram

A post shared by Radha (@radhanair_r)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..