Thimmarusu Review: తిమ్మరుసు తెలివితేటలు… థియేటర్లో గెలిపిస్తాయా?

Thimmarusu Movie Review: కంపేరింగ్‌ టు స్మార్ట్ స్క్రీన్స్ 70 ఎంఎం థియేటర్స్ ఫీల్‌ ఈజ్‌ ఆల్వేస్‌ గుడ్‌ అని ఫిక్సయ్యారు తిమ్మరుసు మేకర్స్. అంత కాన్ఫిడెంట్‌గా ఫస్ట్ స్టెప్ వేసిన తిమ్మరుసు మెప్పిస్తాడా? ఇంతకీ బొమ్మ అదుర్సా? బెదుర్సా?

Thimmarusu Review: తిమ్మరుసు తెలివితేటలు... థియేటర్లో గెలిపిస్తాయా?
Thimmarusu
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 30, 2021 | 2:18 PM

Satyadev’s Thimmarusu Movie Review: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టైమ్‌ వచ్చేసింది. థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి. థియేటర్లలో ఆ ఫస్ట్ బొమ్మ పడింది. తెలంగాణలో కంప్లీట్‌ ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ, ఆంధ్రలో మాత్రం 50 పర్సెంట్‌ అలో చేస్తున్నారు. అయినా నో ప్రాబ్లమ్‌.. కంపేరింగ్‌ టు స్మార్ట్ స్క్రీన్స్ 70 ఎంఎం థియేటర్స్ ఫీల్‌ ఈజ్‌ ఆల్వేస్‌ గుడ్‌ అని ఫిక్సయ్యారు తిమ్మరుసు మేకర్స్. అంత కాన్ఫిడెంట్‌గా ఫస్ట్ స్టెప్ వేసిన తిమ్మరుసు మెప్పిస్తాడా? ఇంతకీ బొమ్మ అదుర్సా? బెదుర్సా? అనేది చూద్దాం.

కథ: రామ్‌ (సత్యదేవ్‌) అడ్వకేట్‌. న్యాయం తరఫున పోరాడాలన్నది అతని కోరిక. ఓ సీనియర్‌ లాయర్‌ దగ్గర పనిచేస్తుంటాడు. ఆ లాయర్‌కి సంపాదన ఒక్కటే ధ్యేయం. కానీ రామ్‌ టార్గెట్‌, ఇంటెన్షన్‌ ఇంకోలా ఉంటుంది. అందుకే అక్కడ ఇమడలేడు. అతని గర్ల్ ఫ్రెండ్‌ (ప్రియాంక) పనిచేసే రావు అసోసియేట్స్ లో చేరాలని కలగంటాడు. అతని డ్రీమ్ ట్రూ అయ్యే అవకాశం వస్తుంది. రావు కన్సల్టెన్సీస్‌ వాళ్లు పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కొత్త వాళ్లని రిక్రూట్‌ చేసుకుంటారు. అలా తన టాలెంట్‌తో రావు అసోసియేట్స్ తో అసోసియేట్‌ అవుతాడు తిమ్మరుసు.

అతని అడ్వకేట్‌ స్కిల్స్ మీద గురి కుదురుతుంది రావుకు. ఇమీడియేట్‌గా ఓ టఫ్‌ కేస్‌ ఫైల్‌ తెప్పించి అతనికి కేసు అప్పగిస్తాడు. ఆ కేసు వాసుకు సంబంధించింది. పబ్‌లో పనిచేసే వాసు ఓ వర్షం పడ్డ రాత్రి కొండాపూర్‌ జంక్షన్‌ మీదుగా వెళ్తుంటాడు. అక్కడ క్యాబ్‌ డ్రైవర్‌ హత్య జరుగుతుంది. దాన్ని ఎవరు చేశారో తెలియదు కానీ, నేరం మాత్రం వాసు మీద పడుతుంది. అతన్ని కేసులో ఇరికిస్తాడు పోలీసు భూపతిరాజు (అజయ్‌). అసలు క్యాబ్‌ డ్రైవర్‌ ఎవరు? అతన్ని హత్య చేయాలనుకున్న వ్యక్తిని భూపతిరాజు ఎందుకు కాపాడాలనుకున్నాడు? వాసును కేసులో ఎందుకు ఇరికించారు? ఎనిమిదేళ్ల తర్వాత రీ ఓపెన్‌ అయిన కేసు గురించి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాసుదేవరావు (అల్లరి రవిబాబు) కు ఎందుకు కంగారు పుట్టింది? వాసుతో పాటు పబ్‌లో పనిచేసిన అమ్మాయిని ఎవరు హత్య చేయించారు? మధ్యలో వాలి ఎవరు? రిటైర్డ్ పోలీస్‌ ఆఫీసర్‌ భాస్కర్‌ సీన్‌లోకి ఎందుకు వచ్చారు? తిమ్మరుసు గర్ల్ ఫ్రెండ్‌ ఇన్‌టెన్షన్‌ ఏంటి? సుధ (బ్రహ్మాజీ)కి తిమ్మరుసుతో ఆల్రెడీ పరిచయం ఉంటుందా? వంటివన్నీ స్క్రీన్‌ మీద చూసి తెలుసుకోవాల్సిందే. వీటిలో ఏ చిన్న విషయాన్ని రివీల్‌ చేసినా ఫైనల్‌గా ఉన్న థ్రిల్‌ని ఆడియన్స్ మిస్‌ అయిపోతారు.

Thimmarusu

Thimmarusu (File Photo)

ఎవరెలా చేశారు? సత్యదేవ్‌ ఓ కేరక్టర్‌ని సెలక్ట్ చేసుకున్నారు అంటేనే, ఆ కథలో ఏదో కొత్త ఎలిమెంట్‌ ఉందనే క్లారిటీ ఆడియన్స్ కి ఉంది. తిమ్మరుసు మీద మేకర్స్ కి, ఆడియన్స్ కి ఉన్న కాన్ఫిడెన్స్ కూడా అదే. 47 డేస్‌, గువ్వా గోరింక, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, పిట్టకథలు, లాక్డ్ … ఇలా కంటిన్యుయస్‌గా ఓటీటీలకే ఓటేసిన సత్యదేవ్‌ డైరక్ట్ థియేట్రికల్‌ రిలీజ్‌ తిమ్మరుసులో ఎలాంటి వేరియేషన్‌ చూపించారు? ఇంతకు ముందు కేరక్టర్స్ తో పోలిస్తే తిమ్మరుసులో సత్యదేవ్‌ గెటప్‌ కొత్తగా ఉంది. ట్రిమ్‌ చేసిన మీసాలు, వెరైటీ హెయిర్‌ స్టైల్‌, స్పెక్స్ట్స్… చూడగానే వింటేజ్‌ ఫీల్‌ని కలిగించినా, కొత్తగా అనిపించారు. కోర్టులో నడిచేటప్పుడు స్పీడ్‌, వాసుతో మాట్లాడేటప్పుడు చూపించే వేరియేషన్స్, బ్రహ్మాజీతో ఉన్నప్పుడు డైలాగ్‌ డెలివరీ టైమింగ్‌… దేనికదే బావుంది. ప్రియాంక తన కేరక్టర్‌ లిమిట్స్ లో కనిపించారు. బ్రహ్మాజీ కామెడీ కాస్త రిలీఫ్‌. వైవా హర్ష సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. 30 వెడ్స్ 21 ఫేమ్‌ చైతన్య రావుకి ఇందులో మంచి ఎలివేషన్‌ ఉన్న కేరక్టర్‌ ఇచ్చారు. వాసు కేరక్టర్‌లో చేసిన వ్యక్తి బాగా నటించాడు. అజయ్‌, ఝాన్సీ, ప్రవీణ్‌… ఎవరి కేరక్టర్లకు వాళ్లు న్యాయం చేశారు. శ్రీచరణ్‌ పాకాల బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం సినిమాకు హైలైట్‌. వర్షం పడ్డ రాత్రి ఓ జంక్షన్‌లో జరిగిన మర్డర్‌ని రకరకాల యాంగిల్స్ లో చూపించిన విధానం కూడా బావుంది. ఇంటర్‌లింక్డ్ సీన్స్ ఆడియన్స్ కి క్యూరియస్‌ కలిగిస్తాయి. లిఫ్ట్ ఫైట్‌ బావుంది.

మంచీచెడులు… న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో ఓడిపోయినా ఫర్వాలేదు. అందులో గెలుపే ఉంటుంది అని ఝాన్సీ చెప్పే డైలాగ్‌, బలవంతుడు బలం ఉన్నంత వరకు గెలుస్తాడు, తెలివైన వాడు ఎప్పుడూ గెలుస్తాడు అని ప్రీ క్లైమాక్స్ లో ఇంటెన్స్ తో సత్యదేవ్‌ చెప్పే మాటలు, న్యాయస్థానంలో జరగాల్సిన న్యాయం గురించి చెప్పే క్లైమాక్స్ డైలాగ్‌ కూడా క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి. సినిమాలో హీరో పేరు రామ్‌ అయినప్పుడు తిమ్మరుసు అని టైటిల్‌ ఎందుకు పెట్టారు? ఈ విషయానికి ఫైనల్‌గా మంచి టచ్‌ ఇచ్చాడు డైరక్టర్‌ శరణ్‌ కొప్పిశెట్టి. కన్నడ బీర్‌బల్‌ని చూసిన వారికి ప్లాట్‌ ముందే తెలిసిపోతుంది కాబట్టి క్లైమాక్స్ వరకు ఎగ్జయిటింగ్‌గా ఉండదు. అవేమీ చూడకుండా నేరుగా తెలుగు వెర్షన్‌ చూస్తే మాత్రం ఎంగేజింగ్‌గానే అనిపిస్తుంది. సత్యదేవ్‌ని నల్లకోటులో చూడగానే వెంటనే వకీల్‌సాబ్‌ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కోర్టు సీన్లలో సత్యదేవ్‌ వాదించడం కన్నా, ఔట్‌సైడ్‌ చేసే ఇన్వెస్టిగేషనే ఎక్కువ. సో పేజీల పేజీల డైలాగులను ఎక్స్ పెక్ట్ చేయొద్దు.

(- డా. చల్లా భాగ్యలక్ష్మి, TV9 తెలుగు, Head- ET Desk)

Also Read..

తీన్‌‌‌‌మార్ స్టెప్పులతో ఊపేసిన వర్షిణి.. వైరల్ అవుతోన్న వీడియో

100 పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత కెమెరా ముందుకు మౌని ముని..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!