Varalakshmi: ఇద్దరు కుర్రాళ్లను కొట్టి జైలుకెళ్లిన వరలక్ష్మి.. ఆసక్తికర విషయం బయటపెట్టిన తండ్రి శరత్‌కుమార్‌

|

Mar 03, 2023 | 3:21 PM

ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్‌. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ లేడీ విలన్‌గా అదరగొడుతోంది.

Varalakshmi: ఇద్దరు కుర్రాళ్లను కొట్టి జైలుకెళ్లిన వరలక్ష్మి.. ఆసక్తికర విషయం బయటపెట్టిన తండ్రి శరత్‌కుమార్‌
Varalakshmi Sarathkumar
Follow us on

ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్‌. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ లేడీ విలన్‌గా అదరగొడుతోంది. పందెం కోడి 2 సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ అందులో వరలక్ష్మీ పోషించిన నెగెటివ్‌ క్యారెక్టర్‌ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తెనాలి రామకృష్ణ LLB, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి.. ఇలా సూపర్‌ హిట్‌ సినిమాల్లో లేడీ విలన్‌గా నటించి పలువురి ప్రశంసలు అందుకుంది. మధ్యలో నాంది, పక్కా కమర్షియల్‌, మైఖేల్‌ తదితర సినిమాల్లో కీ రోల్స్‌ పోషించి తాను అన్ని రకాల పాత్రలకు సూట్‌ కాగలనని నిరూపించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో హనుమాన్‌, శబరితో పాటు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోన్న వరలక్ష్మీ శరత్ కుమార్‌ పుట్టిన రోజు నేడు (మార్చి 5). ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఈ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌కు విషెస్‌ చెబుతున్నారు. వరలక్ష్మీ నటించిన తాజా చిత్రం కొండ్రాల్ పావమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఈవెంట్‌లో మాట్లాడిన వరలక్ష్మీ తండ్రి శరత్‌కుమార్‌ తన కూతురు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘ఇప్పుడు అందరూ వరలక్ష్మిని విజయశాంతితో పోల్చుతున్నారు. అది వాస్తవమే. నా కూతురు సినిమాల్లోకి వస్తానని అన్నప్పుడు.. ఇప్పుడు అవసరమా? అని అడిగాను. కానీ ఆమె సినిమాలు చేయడానికే సిద్ధమైంది. ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి ఆమె కఠిన శ్రమనే కారణం. అలానే వరలక్ష్మి చాలా ధైర్యవంతురాలు. ఓరోజు రాత్రి.. మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉందని, ఇద్దరబ్బాయిల్ని కొట్టిందని ఫోన్ వచ్చింది. వారు అంతకు ముందు తన కారుకు డ్యాష్‌ ఇవ్వడంతో వారిద్దరినీ చితకబాదింది’ అని శరత్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శరత్‌ కుమార్‌ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వరలక్ష్మి ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..