Actress: నటి పై దాడి.. తలకి బలమైన గాయం.. హాస్పటల్‌లో చికిత్స
తలకి బలమైన గాయమవ్వడం హాస్పటల్ లో చేరాల్సి వచ్చింది. ఒక భూ వివాదంలో నటి పై తీవ్రంగా దాడి చేశారు కొందరు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు.? ఆమె పై ఎందుకు దాడి చేశారు..?

సినిమా తారలు షూటింగ్స్ లో గాయపడటం మనం చూస్తూ ఉంటాం. హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా షూటింగ్స్ లో గాయపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొంత మంది సినీ సెలబ్రెటీల పై దాడి జరిగిన ఘటనలు కూడా మనం చూసే ఉంటాం. తాజాగా ఓ నటి పై కొందరు వ్యక్తు దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. తలకి బలమైన గాయమవ్వడం హాస్పటల్ లో చేరాల్సి వచ్చింది. ఒక భూ వివాదంలో నటి పై తీవ్రంగా దాడి చేశారు కొందరు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు.? ఆమె పై ఎందుకు దాడి చేశారు..? అసలు భూవివాదంలోకి నటి ఎందుకు వెళ్ళింది.?
శాండల్ వుడ్ కి చెందిన నటి అను గౌడ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కస్పాడిలో లో ఆమెకు ఓ భూమి ఉంది. ఆమె తల్లి దండ్రులు అప్పుడప్పుడు అందులో వ్యవసాయం కూడా చేస్తుంటారు కూడా.. బెంగుళూరులో ఉండే ఆమె అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటుంది.
అయితే ఈ భూమి పై వివాదం కూడా నడుస్తుంది. తాజాగా ఆమె ఈ భూమి దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో నీలమ్మ, మోహన్ అనే వ్యక్తులు అను గౌడ పై దడి చేశారు. దాంతో ఆమె తలకు తీవ్రంగా గాయం అయ్యింది. తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇదే న్యూస్ శాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Anu Goud




