AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samyuktha Menon: తెలుగు సినిమాలపై సంయుక్త ఆసక్తికర కామెంట్స్.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలంటూ..

చివరిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ మలయాళంలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది సంయుక్త. తాజాగా గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది సంయుక్త. తెలుగులో సినిమాలు చేయాలంటే చాలా కష్టమని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

Samyuktha Menon: తెలుగు సినిమాలపై సంయుక్త ఆసక్తికర కామెంట్స్.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలంటూ..
Samyuktha Menon
Rajitha Chanti
|

Updated on: May 10, 2024 | 2:28 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వరుసగా విజయాలను అందుకుంటూ తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి మాత్రం మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఆఫర్స్ రాలేదా ? లేదా అవకాశాలను వదిలేసుకుంటుందా ? అనేది మాత్రం తెలియరాలేదు. చివరిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ మలయాళంలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది సంయుక్త. తాజాగా గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది సంయుక్త. తెలుగులో సినిమాలు చేయాలంటే చాలా కష్టమని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమలో తనకు ఎదురైన పరిస్థితులు.. కష్టాల గురించి ఇంటర్వ్యూలో బయటపెట్టింది. సంయుక్త మాట్లాడుతూ.. “తెలుగు సినిమాల్లో నటించడం చాలా కష్టం. ముఖ్యంగా ఇక్కడ భాష రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. అలాగే మేకప్. ఇది చెబితే చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ నా వరకు అదే పెద్ద విషయం. మలయాళ సినిమాల్లో మేకప్ త్వరగా అయిపోతుంది. అక్కడ చాలా సహజంగా కనిపిస్తాము. కానీ ఇక్కడ తెలుగు సినిమాల్లో మేకప్ ఎక్కువగా వేస్తారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీన్ పై ఎలా కనిపిస్తున్నామనేది చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మేకప్ ఎక్కువగా వేయడం వల్ల ముఖంపై ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. చిరాకు వేస్తుంది. ” అంటూ చెప్పుకొచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా, నిత్య మీనన్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. కానీ ఈ మూవీతోనే తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత విరూపాక్ష, సార్ వంటి చిత్రాలతో మరిన్ని హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఇక కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సంయుక్త మలయాళీ చిత్రాల్లో నటిస్తుంది.

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.