Shaakuntalam: సమంత శాకుంతలం మూవీ థియేట్రికల్ బిజినెస్ లెక్క ఎంతంటే..
పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది.

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ శాకుంతలం. ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో సామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా తెరకెక్కించే గుణ శేఖర్ మరోసారి ‘శాకుంతలం’ వంటి విజువల్ వండర్‌తో పాన్ ఇండియా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి హిట్ ను అందుకున్నారు.
డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటించారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’.
ఇక శాకుంతలం మూవీ థియేట్రికల్ బిజినెస్ ఎలా జరిగిందంటే.. నైజాం 4.00 కోట్లు, సీడెడ్ 1.50కోట్లు, ఆంధ్ర 5.00కోట్లు, ఏపీ,తెలంగాణ 10.50కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.20 కోట్లు, మిగిలిన భాషల్లో 4.00 కోట్లు, ఓవర్సీస్ 1.80 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 17.50 కోట్ల బిజినెస్ చేసింది ఈ సినిమా.