Samantha: మరో బ్రాండ్ ఆఫర్ కొట్టేసిన సమంత.. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో..
స్టార్ హీరోయిన్ గా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత.. ఇప్పటివరకు చాలా రకాల ఉత్పత్తులను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే గత రెండేళ్ల కాలంలో సమంత పెద్దగా ఎండార్స్మెంట్ చేయలేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఆమె క్రేజ్ పెంచుకుంటున్నారు.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకుంది సమంత. సినీ ప్రయాణంలోనే కాకుండా.. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న సామ్.. ఇటు వ్యాపారరంగంలోనూ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు సామ్. స్టార్ హీరోయిన్ గా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత.. ఇప్పటివరకు చాలా రకాల ఉత్పత్తులను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే గత రెండేళ్ల కాలంలో సమంత పెద్దగా ఎండార్స్మెంట్ చేయలేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఆమె క్రేజ్ పెంచుకుంటున్నారు.
తాజాగా మరో బ్రాండ్ ఆఫర్ కొట్టేసింది సంత. ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ పెప్సీ సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. తాజాగా ఆమెతో చేసిన పెప్సీ యాడ్ రిలీజ్ చేశారు. ఇందులో డిఫరెంట్ లుక్స్ లో సామ్ కనిపిస్తూత పెప్సీ తాగమని ప్రమోట్ చేస్తూంది. పెళ్లి కూతురు గెటప్ నుంచి యాక్షన్ హీరోయిన్ లుక్ వరకు సమంత కనిపించడం విశేషం. గతంలో మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు లాంటి సౌత్ హీరోస్ ఈ బ్రాండ్ ప్రమోట్ చేశారు.
ప్రస్తుతం సమంత.. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.