AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: లాంగ్ టైమ్ డ్రీమ్ పూర్తి చేసే పనిలో సమంత.. అదేంటంటే

 ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు సమంత. మయోసైటిస్ వచ్చినప్పటి నుంచి ఏ మాత్రం రిస్క్ తీసుకోడానికి ఇష్టపడటం లేదు. అందుకే తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సినిమాలు చేయాలనుకోవడం లేదు.

Samantha: లాంగ్ టైమ్ డ్రీమ్ పూర్తి చేసే పనిలో సమంత.. అదేంటంటే
Samantha
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jul 18, 2023 | 9:40 AM

Share

ఖుషీ షూటింగ్ అయిపోయింది.. సిటాడెల్‌లో తన పోర్షన్ పూర్తైపోయింది.. పైగా ముందుగానే ఏడాది బ్రేక్ కూడా అనౌన్స్ చేసారు.. దాంతో ఇంకేముంది సమంత ఫారెన్ వెళ్లిపోయుంటారు.. ఇలా షూటింగ్ అయిపోగానే అలా ఫ్లైట్ ఎక్కేసుంటారని అనుకుంటున్నారంతా. కానీ అక్కడికి వెళ్లే ముందే తన లాంగ్ టైమ్ డ్రీమ్ ఒకటి పూర్తి చేసుకుంటున్నారు ఈ బ్యూటీ. ప్రస్తుతం అదే పని మీదున్నారు స్యామ్. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు సమంత. మయోసైటిస్ వచ్చినప్పటి నుంచి ఏ మాత్రం రిస్క్ తీసుకోడానికి ఇష్టపడటం లేదు. అందుకే తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఇప్పటికే విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషీ షూటింగ్ పూర్తైపోయింది. దాంతో పాటు సిటాడెల్ సిరీస్‌లోనూ ఈ మధ్యే తన కారెక్టర్ పూర్తి చేసారు స్యామ్. ప్రస్తుతానికి కొత్త సినిమాలకు దూరంగానే ఉన్నారీమె.

షూటింగ్ నుంచి ఫ్రీ అయిపోయారు కదా.. నేడో రేపో ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్తారని ఫ్యాన్స్ అనుకుంటుండగా.. అనుకోని ట్విస్ట్ ఇచ్చారు సమంత. ప్రస్తుతం తన లాంగ్ టైమ్ డ్రీమ్ నెరవేర్చుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఓ రోడ్ ట్రిప్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు సమంత. కానీ షూటింగ్స్ బిజీ ఓ వైపు.. మయోసైటిస్ మరోవైపు ఉండటంతో కుదర్లేదు. ఇన్నాళ్లకు ఆ ఫ్రీ టైమ్ వచ్చింది.. అందుకే హాయిగా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు స్యామ్.

తన రోడ్ ట్రిప్ వీడియోను అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు సమంత. ఈ క్రమంలోనే ఆమె తమిళనాడులో ఉన్న దేవాలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ రోడ్ ట్రిప్ అయ్యాకే.. అమెరికా వెళ్లి చికిత్స తీసుకోనున్నారు. చికిత్స కోసం స్యామ్ వెళ్తున్నారనే సంగతి ఆమె హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ అధికారికంగా కన్ఫమ్ చేయడమే కాదు.. ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు.

24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు
రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు
IPL 2026 Auction: వేలం తర్వాత మారిన ముగ్గురు కెప్టెన్లు..
IPL 2026 Auction: వేలం తర్వాత మారిన ముగ్గురు కెప్టెన్లు..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అదే హీరో సినిమాలో హీరోయిన్..!
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అదే హీరో సినిమాలో హీరోయిన్..!