అవునా..ఆమె గర్భవతా? తెలిస్తే మాకూ చెప్పండి!
హైదరాబాద్: టాలీవుడ్ ఏస్ హీరోయిన్ సమంత తల్లి కాబోతుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ ‘సమంత గర్భవతా?’ అంటూ కథనం రాసింది. ఆమె తాజాగా ‘ఓ బేబీ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్విటర్‌లో ‘సమంత అక్కినేని’గా ఉన్న తన పేరును ‘బేబీ అక్కినేని’గా మార్చుకున్నారు.అయితే గత సినిమాల విడుదల సమయంలో ఆమె ఎప్పుడూ ఇలా ఖాతా పేరు మార్చలేదని, ఇప్పుడు మార్చడం వెనుక కారణం ఆమె గర్భవతి […]
హైదరాబాద్: టాలీవుడ్ ఏస్ హీరోయిన్ సమంత తల్లి కాబోతుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ ‘సమంత గర్భవతా?’ అంటూ కథనం రాసింది. ఆమె తాజాగా ‘ఓ బేబీ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్విటర్‌లో ‘సమంత అక్కినేని’గా ఉన్న తన పేరును ‘బేబీ అక్కినేని’గా మార్చుకున్నారు.అయితే గత సినిమాల విడుదల సమయంలో ఆమె ఎప్పుడూ ఇలా ఖాతా పేరు మార్చలేదని, ఇప్పుడు మార్చడం వెనుక కారణం ఆమె గర్భవతి కావడమేనని ఊహిస్తూ సదరు వెబ్‌సైట్ ఆర్టికల్ రాసుకొచ్చింది. దీన్ని చూసిన సామ్ ట్విటర్‌లో ఫన్నీగా స్పందించారు. ‘అయ్యో.. అవునా.. ఆమె గర్భవతా?.. మీకు తెలిసినప్పుడు మాకు కూడా చెప్పండి’ అని సరదాగా ట్వీట్ చేశారు.సమంతా రిప్లై చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. సామ్ సూపర్‌గా సమాధానం చెప్పారని అభిప్రాయపడ్డారు. ‘ఓ బేబీ’ సినిమా జులై 5న విడుదల కాబోతోంది. దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగశౌర్య, లక్ష్మి, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’కి తెలుగు ‘ఓ బేబీ’ తెరకెక్కుతోంది.
Damnnn ……. is she ? When you find out please let us know https://t.co/Gk3oYnABYU
— Baby Akkineni (@Samanthaprabhu2) June 10, 2019