ట్రాక్టర్లు, ఎడ్లబళ్లపై సరకులు పంపిన స‌ల్లూ భాయ్..

ట్రాక్టర్లు, ఎడ్లబళ్లపై సరకులు పంపిన స‌ల్లూ భాయ్..

బాలీవుడ్‌ స్టార్ హీరో‌ సల్మాన్‌ ఖాన్‌ మరోసారి తన మంచి మ‌న‌సు చాటుకున్నారు. ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆయన మరోసారి పేదలకు ద‌న్నుగా నిల‌బ‌డ్డారు. మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో ఆకలితో ఇబ్బందులు ప‌డుతోన్న‌ పేదల కోసం తన ఫాంహౌస్‌ నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో రేషన్‌ పంపారు. అందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో సల్మాన్​తోపాటు ఆయన ఫ్రెండ్స్.. నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, రొమేనియా టీవీ హోస్ట్ లులియా వంతూర్, సింగ‌ర్ […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

May 05, 2020 | 4:53 PM

బాలీవుడ్‌ స్టార్ హీరో‌ సల్మాన్‌ ఖాన్‌ మరోసారి తన మంచి మ‌న‌సు చాటుకున్నారు. ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆయన మరోసారి పేదలకు ద‌న్నుగా నిల‌బ‌డ్డారు. మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో ఆకలితో ఇబ్బందులు ప‌డుతోన్న‌ పేదల కోసం తన ఫాంహౌస్‌ నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో రేషన్‌ పంపారు. అందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశారు.

ఈ వీడియోలో సల్మాన్​తోపాటు ఆయన ఫ్రెండ్స్.. నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, రొమేనియా టీవీ హోస్ట్ లులియా వంతూర్, సింగ‌ర్ కమల్‌ ఖాన్‌ తదితరులకు రేషన్‌ పంపిణీ చేయడానికి హెల్ప్ చేశారు. సంచుల్లో సరకులు నింపి, వాటిని వెహిక‌ల్స్ లో నింపారు. వీటిని సల్మాన్‌ ఫాంహౌస్‌కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని పేద‌ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో స‌ల్లూ భాయ్‌పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వ‌ర్షం కురిపించారు.

కరోనా వీర‌విహారం చేస్తోన్న స‌మయంలో, లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి పన్వెల్‌ ఫాంహౌస్‌లోనే ఉంటున్నారు సల్మాన్. ఆయన ఫ్యామిలీ మెంబ‌ర్స్ ముంబయిలోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సల్మాన్‌ సాయం చేశారు. 25 వేల మంది సినీ కార్మికులకు ద‌శ‌ల‌ వారీగా బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకూ సాయం చేస్తానని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇటీవలే ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని దివ్యాంగులకు రూ.3000 చొప్పున అందించారు.

View this post on Instagram

@jacquelinef143 @vanturiulia @rahulnarainkanal @imkamaalkhan @niketan_m @waluschaa @abhiraj88

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu