AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ‘సలార్’ ఆరు రోజుల కలెక్షన్స్.. ఆ రికార్డ్ చేరువలో ప్రభాస్..

మొదటి మూడు రోజుల్లో భారీగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత నాలుగు, ఐదు రోజుల్లో కాస్త తగ్గినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా రూ.500 కోట్లకు చేరువలో ఉంది. నిన్న ఒక్కరోజే ఈ సినిమా రూ. 23.50 కోట్లకు పైగా వసూలు చేసింది. సాక్‌నిల్క్‌లోని ఒక నివేదిక ప్రకారం బుధవారం ఈ సినిమా మొత్తం 28.02% తెలుగు ఆక్యుపెన్సీని కలిగి ఉంది. అలాగే 21.56% మలయాళం ఆక్యుపెన్సీని కలిగి ఉంది. తమిళంలో 18.20% ఆక్యుపెన్సీ, 22.95% కన్నడ ఆక్యుపెన్సీని కలిగి ఉంది.

Salaar Movie: 'సలార్' ఆరు రోజుల కలెక్షన్స్.. ఆ రికార్డ్ చేరువలో ప్రభాస్..
Salaar Movie
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2023 | 8:20 AM

Share

ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ‘సలార్’. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా 2023లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన భారీ బడ్జెట్‏ మూవీగా నిలిచింది. ఈ సినిమా మొదటిరోజే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో భారీగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత నాలుగు, ఐదు రోజుల్లో కాస్త తగ్గినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా రూ.500 కోట్లకు చేరువలో ఉంది. నిన్న ఒక్కరోజే ఈ సినిమా రూ. 23.50 కోట్లకు పైగా వసూలు చేసింది. సాక్‌నిల్క్‌లోని ఒక నివేదిక ప్రకారం బుధవారం ఈ సినిమా మొత్తం 28.02% తెలుగు ఆక్యుపెన్సీని కలిగి ఉంది. అలాగే 21.56% మలయాళం ఆక్యుపెన్సీని కలిగి ఉంది.

తమిళంలో 18.20% ఆక్యుపెన్సీ, 22.95% కన్నడ ఆక్యుపెన్సీని కలిగి ఉంది. అలాగే డిసెంబర్ 27 నాటికి హిందీలో 28.98% కలిగి ఉంది. తొలిరోజు భారతదేశంలో అన్ని భాషల్లో కలిపి మొత్తం రూ.95 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత రెండో రోజు కేవలం రూ.56.35 కోట్లు రాబట్టింది. మూడో రోజు బాక్సాఫీస్ వద్ద మళ్లీ దూసుపోయింది. మూడవ రోజు రూ.62.05 కోట్ల కలెక్షన్లను వసూళు చేసింది.కానీ ఆ తర్వాత నాలుగో రోజు రూ.43 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక మంగళవారం రూ.24.9 కోట్లు రాబట్టింది.

ఈ ఏడాది చివర్లో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ సినిమాతో పోటీపడి గెలిచింది సలార్. షారుఖ్ నటించిన ఈ సినిమాపై ప్రభాస్ సలార్ చిత్రం పైచేయి సాధించింది. సలార్ కంటే ఒకరోజు ముందే విడుదలైన డంకీ సినిమా ఇప్పటివరకు భారతదేశంలో రూ.140.20 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల మైలురాయిని అందుకున్న ఏకైక సౌత్ ఇండియన్ సినిమాగా జైలర్ నిలించింది. ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ చేసేందుకు సలార్ అతి తక్కువ దూరంలోనే ఉంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.