నితిన్ కు జోడీగా హైబ్రిడ్‌ పిల్లతో.. ఈ యంగ్ హీరోతో కలిసి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసినా..?

రంగ్‌దే సినిమాతో మంచి హిట్‌ను సొంతం చేసుకున్న నితిన్‌.. ఇప్పుడు ఎర్రబుగ్గల హైబ్రిడ్‌ పిల్లతో నటించడానికి సిద్దం అవుతున్నాడట. అంతే కాదు ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా నిలదొక్కుకుంటున్న.. ఓ రచయిత డైరెక్షన్లో ఈ సినిమా చేయబోతున్నాడట.

  • Rajeev Rayala
  • Publish Date - 4:06 pm, Wed, 7 April 21
నితిన్ కు జోడీగా హైబ్రిడ్‌ పిల్లతో.. ఈ యంగ్ హీరోతో కలిసి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసినా..?
Nithin

Sai Pallavi, Nithiin : రంగ్‌దే సినిమాతో మంచి హిట్‌ను సొంతం చేసుకున్న నితిన్‌.. ఇప్పుడు ఎర్రబుగ్గల హైబ్రిడ్‌ పిల్లతో నటించడానికి సిద్దం అవుతున్నాడట. అంతే కాదు ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా నిలదొక్కుకుంటున్న.. ఓ రచయిత డైరెక్షన్లో ఈ సినిమా చేయబోతున్నాడట. ఇంతకీ ఎవరా ఎర్రబుగ్గల పిల్ల.. ఏంటా సినిమా అని అనుకుంటున్నారా… చెబుతా వినండి!

యంగ్ హీరో నితిన్ 2021లో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత ఇటీవల రంగ్ దే సినిమా రిలీజ్ చేసాడు నితిన్. ఈ సినిమా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్ రీమేక్ మ్యాస్ట్రో సినిమాను పట్టాలెక్కించాడు. అయితే రచయిత టూ డైరెక్టర్ గా మొన్నామధ్యన మారిన వక్కంతం వంశీ… ఇప్పుడు నితిన్ హీరోగా ఓ సినిమాను ప్లాన్‌ చేశాడట. ఇప్పటికే ఓ స్టోరీని రెడీ చేసిన ఈ డైరెక్టర్‌ నితిన్‌కు నరేట్ చేసి మరీ.. ఓకే చేయించుకున్నాడట. అయితే ఈ సినిమాకి హీరోయిన్‌గా హైబ్రిడ్‌ పిల్ల సాయిపల్లవిని ఓకే చేశాడట డైరెక్టర్ వక్కంతం వంశీ. లవర్‌బాయ్‌ నితిన్‌ సరసన ఈ ఫిదా భామ అయితే జనాలు ఫిదా అవడం కాయమనే.. ఈ కాంబినేషన్ను సెట్ చేశాడట.. డైరెక్టర్‌ వంశీ. ఇక సాయి పల్లవి నటించిన ‘లవ్‌ స్టోరీ’, ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో నితిన్‌ హిందీ “అందాదున్‌” రిమేక్ ‘మాస్ట్రో’ షూట్‌లో బిజీగా ఉన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sonu Sood: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రియల్ హీరో.. సంజీవని వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన సోనూసూద్..

వాళ్ళతో ఫైట్ చేసేంత ఓపిక.. డబ్బు.. టైం కూడా లేదు.. ఏ ఒక్కటి ఉన్న ఫైట్ చేస్తా.. ‘పక్కింటి కుర్రాడి’ మాటలు..

‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. సమంతకు ఇష్టసఖిగా రానున్న ఆ హీరోయిన్…