AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: ఆ సినిమా సెట్‏లో ఏడ్చేసిన సాయి పల్లవి.. చివరకు చెల్లెలు చూసి నిర్మాతతో..

పాన్ ఇండియా సినీప్రియులు ఎక్కువగా అభిమానించే నటి సాయి పల్లవి. తెలుగు, మలయాళం, తమిళంలో పలు చిత్రాల్లో నటించి అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఓవైపు అద్భుతమైన నటన.. మరోవైపు కళ్లు తిప్పుకోనివ్వని డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సాయి పల్లవికి స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Sai Pallavi: ఆ సినిమా సెట్‏లో ఏడ్చేసిన సాయి పల్లవి.. చివరకు చెల్లెలు చూసి నిర్మాతతో..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2024 | 8:15 AM

Share

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న అభిమానగణం గురించి చెప్పక్కర్లేదు. ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. కంటెంట్, నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెను అభిమానులు ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇటీవలే అమరన్ సినిమాతో మరోసారి అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఇందులో ఇందు రెబికా వర్గీస్ పాత్రలో మరోసారి అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. మరోవైపు రామాయణం సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి ఓ సినిమా షూటింగ్ లో తాను ఎదుర్కొన్న కష్టాలు, మానిసిక ఒత్తిడి గురించి చెప్పుకొచ్చింది.

గలాటా ప్లస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. “శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ ఒకరోజు పూర్తైనా ఎంతో సంతోషించేదాన్ని. ఎందుకంటే నాకు రాత్రిళ్లు షూట్ చేయడం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నిద్రలేకపోతే నేను త్వరగా అలసిపోతాను. కానీ శ్యామ్ సింగరాయ్ సినిమాకు కంటిన్యూగా రాత్రిళ్లు షూటింగ్ జరిగింది. దీంతో నాకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. అలాగే షెడ్యూల్స్ వల్ల మానసికంగానూ, శారీరకంగానూ చాలా అలసిపోయాను. దాదాపు ముప్పై రోజులపాటు కంటిన్యూగా షూటింగ్ జరిగింది. పనిభారం, అలసటతో చాలా నీరసించి పోయాను. దీంతో షూటింగ్ సెట్ లో ఏడ్చేశాను.. కానీ నాకు ఆ సినిమాలో నటించాలని ఉండేది. ఒక్కరోజైనా సెలవు ఉండే బాగుండు అని కోరుకున్నాను. కానీ నేనెప్పుడు ఏ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. నేను ఏడుస్తున్నప్పుడు మా చెల్లెలు చూసింది. దీంతో నేరుగా నిర్మాత దగ్గరకు వెళ్లి తను ఏడుస్తుంది. ఒకరోజు సెలవు కావాలని అడిగింది. దీంతో విషయం తెలుసుకున్నా నిర్మాత సెట్స్ లో ఉన్నవారు 10 రోజులు సెలవు తీసుకుని అన్నీ సర్దుకున్నాక తిరిగి రావాలని చెప్పారు” అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకుంది సాయిపల్లవి.

ఇటీవలే అమరన్ సినిమాతో హిట్టు కొట్టింది సాయి పల్లవి. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ హీరోగా నటించగా.. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. మరోవైపు తెలుగులో నాగచైతన్య సరసన తండేల్.. హిందీలో రామాయణం చిత్రాల్లో నటిస్తుంది.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
ఉద్యోగం చేసేవారి అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం శుభవార్త
ఉద్యోగం చేసేవారి అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం శుభవార్త
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 200 కోట్ల సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 200 కోట్ల సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
భారతీయ ఉద్యోగులకు భారీ ఊరట.. జూలై 15 నుంచి CETA అమల్లోకి
భారతీయ ఉద్యోగులకు భారీ ఊరట.. జూలై 15 నుంచి CETA అమల్లోకి
ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MoUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!
ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MoUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!