Sai Pallavi: నా గురువు ఇలాంటి అద్భుతమైన కథలెన్నో అందించాలి.. కుబేర సినిమాపై సాయి పల్లవి ట్వీట్..

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుంటూ ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ సాయి పల్లవి. గతేడాది అమరన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె.. ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో నటిస్తుంది. తాజాగా కుబేర సినిమాపై ఆసక్తికర పోస్ట్ చేసింది.

Sai Pallavi: నా గురువు ఇలాంటి అద్భుతమైన కథలెన్నో అందించాలి.. కుబేర సినిమాపై సాయి పల్లవి ట్వీట్..
Sai Pallavi

Updated on: Jun 20, 2025 | 2:45 PM

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటేస్ట్ సినిమా కుబేర. అక్కినేని నాగార్జున, కోలీవుడ్ హీరో ధనుష్, నేషనల్ క్రిష్ రష్మిక మందన్నా ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ వచ్చేసింది. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం శుక్రవారం (జూన్ 20)న అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ సాయి పల్లవి కుబేర సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశారు. కుబేర సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని.. అలాగే తనకు ఇష్టమైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల అని.. తన గురువు ఇలాంటి అద్భుతమైన కథలను మరెన్నో అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

“కుబేర సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే సవాలుతో కూడుకున్న పాత్రలను ఎంచుకోవడంలో ముందుండే ధనుష్.. మరోసారి తన అద్భుతమైన నటనతో కట్టిపడేయనున్నారు. అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అగ్ర హీరో నాగార్జున ఇలాంటి పాత్రలో చూడడం అభిమానులకు కనువిందు. శేఖర్ తెరకెక్కించే చిత్రాల్లో హీరోయిన్స్ పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే ఇందులో రష్మిక పోషించే పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న ఆమెకు ఈ సినిమా మరో విజయాన్ని అందించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. మీ కెరీర్ లోని బెస్ట్ అల్బమ్స్ లో ఇదీ ఒకటి. ఈ సినిమా కోసం చెమటోడ్చిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు అందాలని కోరుకుంటున్నాను.. స్వచ్ఛమైన హృదయం.. అద్భుతమైన టాలెంట్ కలిగిన వ్యక్తి.. నాకెంతో ఇష్టమైన దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. తన కథలతో ఎంతోమందిలో స్పూరి నింపారు. అలా ప్రేరణ పొందిన వారిలో నేనూ ఒకదాన్ని. నా గురువు.. ఎప్పుడూ సంతోషం, ఆయురారోగ్యాలతో జీవించాలని.. ఇలాంటి అద్భుతమైన కథలెన్నో మనకు అందించాలని కోరుకుంటున్నాను. ఈ టీమ్ ఆనందం కోసం నేను ప్రార్థిస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది.

శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబోలో హిట్ మూవీస్ వచ్చాయి. అంతేకాకుండా ఆయన తెరకెక్కించిన ఫిదా సినిమాతోనే సాయి పల్లవి తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ సైతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాలతో తెలుగులో సాయిపల్లవి మరింత క్రేజ్ వచ్చేసింది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..