సినిమా రిలీజ్‌కు ముందు ఏం చేస్తాడో చెప్పేసిన “సాహో” ప్రభాస్

టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా షేక్ చేస్తున్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో… ప్రమోషన్‌లో దూసుకుపోతున్నాడు. దీనిలో భాగంగా బుల్లితెరపై ఆకట్టుకుంటున్న కపిల్ శర్మ షోల్ ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ కలిసి పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ తన జీవితంలో ఆసక్తికర సంఘటనల్ని పంచుకున్నాడు. మీ సినిమా రిలీజ్‌కు ముందు ఏం చేస్తారు? అని ప్రశ్నించిన కపిల్‌శర్మకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు ప్రభాస్. తాను నటించిన ఏ చిత్రం రిలీజవుతున్నా.. […]

సినిమా రిలీజ్‌కు ముందు ఏం చేస్తాడో చెప్పేసిన  సాహో ప్రభాస్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 24, 2019 | 3:57 AM

టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా షేక్ చేస్తున్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో… ప్రమోషన్‌లో దూసుకుపోతున్నాడు. దీనిలో భాగంగా బుల్లితెరపై ఆకట్టుకుంటున్న కపిల్ శర్మ షోల్ ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ కలిసి పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ తన జీవితంలో ఆసక్తికర సంఘటనల్ని పంచుకున్నాడు. మీ సినిమా రిలీజ్‌కు ముందు ఏం చేస్తారు? అని ప్రశ్నించిన కపిల్‌శర్మకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు ప్రభాస్. తాను నటించిన ఏ చిత్రం రిలీజవుతున్నా.. ఆ ముందు రోజు రాత్రి బాగా నిద్రపోతానని.. అయితే నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్రపట్టదని చెప్పాడు. ఒక పక్క టెన్షన్ వేధిస్తుంటే ఇక నిద్ర ఎలా వస్తుంది ? అంటూ ప్రభాస్ సమాధానమిచ్చాడు.

సుజిత్ డైరెక్షన్‌లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన సాహో చిత్రం బాలీవుడ్‌ని కూడా షేక్ చేస్తోంది. ఈ చిత్రం ప్రభాస్, శ్రద్ధాలకు చాల ప్రత్యేకం. ఎందుకంటే 2017లో వచ్చిన బాహుబలి-2 తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీకి తెలిసొచ్చింది. ఇక సాహో చిత్రంతో తెలుగు తెరకు తొలిసారి పరిచయమవుతోంది శ్రద్ధా.

https://www.instagram.com/p/B1bkjqEHZ-c/?utm_source=ig_embed