‘సాహో’ కోసం ‘కాస్ట్ కట్టింగ్’!

'సాహో' కోసం 'కాస్ట్ కట్టింగ్'!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇది ఇలా ఉండగా మొదట్లో ఈ మూవీ కోసం కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్న చిత్ర యూనిట్.. ఆమె 5 కోట్ల రెమ్యునరేషన్ అడిగేసరికి వెనక్కి తగ్గారు. ఇక ఆ తర్వాత శ్రద్ధా […]

Ravi Kiran

|

Aug 23, 2019 | 8:12 PM

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇది ఇలా ఉండగా మొదట్లో ఈ మూవీ కోసం కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్న చిత్ర యూనిట్.. ఆమె 5 కోట్ల రెమ్యునరేషన్ అడిగేసరికి వెనక్కి తగ్గారు. ఇక ఆ తర్వాత శ్రద్ధా కపూర్ కథానాయకిగా ఎంపికైంది.

మరోవైపు శ్రద్ధా ఈ సినిమా కోసం 7 కోట్ల దాకా పారితోషికం తీసుకుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ఆమె 3 కోట్లు రెమ్యునరేషన్ పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ‘సాహో’ రిలీజ్‌తో శ్రద్ధాకు విపరీతమైన క్రేజ్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu