AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ ఆర్థిక స్థితిగతులపై నిర్మలా సీతారామన్ ముఖ్య ప్రకటనలు

భారత ఆర్థిక స్థితిగతుల గురించి తెలియజేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు మీడియాతో సమావేశం నిర్వహించారు. అమెరికా, చైనా వంటి దేశాల కన్నా వృద్ధి రేటులో ముందున్నామని ఆమె తెలిపారు.  దేశ ఆర్థిక వృద్ధి రేటును పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయొచ్చనే అంచనాల నడుమ నిర్మలా సీతారామన్  మీడియాతో మాట్లాడారు. సంస్కరణలు కొనసాగిస్తూ, ఇన్వెష్టర్లను ప్రోత్సహిస్తూ రూపొందించిన తాజా ప్రణాళికను ప్రకటించారు. గతి ప్రయాణంలో కీలకమైన సంపద సృష్టికర్తలకు తమ ప్రభుత్వం […]

దేశ ఆర్థిక స్థితిగతులపై నిర్మలా సీతారామన్ ముఖ్య ప్రకటనలు
High Paying Jobs are in Blockchain. Don't Waste Time.… (upGrad & IIIT-B: PG Diploma in Software Development: Specialisation in Blockchain) SHARE EMAIL PRINT COMMENTS Nirmala Sitharaman addressed a press conference on Friday
Ram Naramaneni
|

Updated on: Aug 23, 2019 | 8:12 PM

Share

భారత ఆర్థిక స్థితిగతుల గురించి తెలియజేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు మీడియాతో సమావేశం నిర్వహించారు. అమెరికా, చైనా వంటి దేశాల కన్నా వృద్ధి రేటులో ముందున్నామని ఆమె తెలిపారు.  దేశ ఆర్థిక వృద్ధి రేటును పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయొచ్చనే అంచనాల నడుమ నిర్మలా సీతారామన్  మీడియాతో మాట్లాడారు. సంస్కరణలు కొనసాగిస్తూ, ఇన్వెష్టర్లను ప్రోత్సహిస్తూ రూపొందించిన తాజా ప్రణాళికను ప్రకటించారు.

గతి ప్రయాణంలో కీలకమైన సంపద సృష్టికర్తలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టంచేశారు నిర్మల. వారిని దృష్టిలో ఉంచుకునే బడ్జెట్​కు రూపకల్పన చేసినట్లు వివరించారు.  ఇన్వెస్టర్లు, వ్యాపార వర్గాలకు ప్రోత్సాహం అందించేలా కీలక నిర్ణయాలు ప్రకటించారు. విదేశీ సంస్థాగత మదుపర్లపై అదనపు సర్​ఛార్​ను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. బడ్జెట్​కు ముందు ఉన్న నిబంధనలే అమల్లో ఉంటాయని తేల్చిచెప్పారు.

ఆమె మాటల పూర్తి సారాంశం:

  • పన్ను చెల్లింపుదారులకు వేధింపులు లేకుండా చర్యలు. ఇకపై పన్ను నోటీసులన్నీ కేంద్రీకృత వ్యవస్థ ద్వారానే జారీ.
  • అమెరికా, జర్మనీ దేశాలు రివర్స్ కర్వ్వ్‌ను చూశాయి. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, చైనా కరెన్సీ వ్యాల్యూ పడిపోవడంతో ప్రపంచ దేశాలపై ప్రభావం పడింది.
  • పాత పన్ను నోటీసులు అన్నింటిపై అక్టోబర్ 1 నాటికి నిర్ణయం. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా తిరిగి అప్​లోడ్​.
  • తగ్గనున్న గృహ, వాహన రుణాల భారం.
  • 2014 నుంచి సంస్కరణలు కొనసాగిస్తూ వస్తున్నాం. సంస్కరణలు అనేవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. వీటి వల్ల వ్యాపార నిర్వహణ సులభతరమౌతుంది. సంస్కరణలకు కొనసాగిస్తాం. పన్ను సంస్కరణలకు కట్టుబడి ఉన్నాం.
  • ఎఫ్‌పీఐలపై సర్‌చార్జ్ పెంపును వెనక్కు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎఫ్‌పీఐలపై సర్‌చార్జ్ పెంచిన విషయం తెలిసిందే.
  • ప్రభుత్వ రంగ బ్యాంకులు లోన్ క్లోజ్ అయిన తర్వాత 15 రోజుల్లోనే లోన్ డాక్యుమెంట్లను కస్టమర్లకు అందిస్తాయి.
  • ప్రభుత్వ బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధనాన్ని అందిస్తాం.
  • ప్రధాని మోదీ ఏం చెప్పారో అదే విషయాన్ని మళ్లీ మీకు తెలియజేయాలని భావిస్తున్నా. సంపద సృష్టించే వారిని గౌరవిస్తాం. బడ్జెట్ ప్రతిపాదనలపై పరిశ్రమ సంబంధిత నిపుణులతో లోతుగా చర్చిస్తాం.

దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు అవసరంలేదని భరోసా ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి. ఇతర దేశాలతో పోల్చితే భారత్​ ఎంతో మెరుగైన స్థితిలో ఉందని స్పష్టంచేశారు.