‘Saaho’ pre-release event: సిక్స్ ఫీట్ హీరో..సిక్ట్సీ ఫీట్ కటౌట్!
‘బాహుబలి’ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు చిత్ర నిర్మాతలు. యువ దర్శకుడు సుజీత్ మూవీని తెరకెక్కించాడు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మూవీలోని ప్రభాస్ స్టిల్‌తో ఫిల్మ్‌సిటీలో 60 అడుగుల ప్రభాస్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటి సాయంత్రం […]

‘బాహుబలి’ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు చిత్ర నిర్మాతలు. యువ దర్శకుడు సుజీత్ మూవీని తెరకెక్కించాడు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మూవీలోని ప్రభాస్ స్టిల్‌తో ఫిల్మ్‌సిటీలో 60 అడుగుల ప్రభాస్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటి సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
కాగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.




