Saaho: సీఎం జగన్‌పై ప్రభాస్ ప్రశంసలు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ షాకింగ్ కామెంట్లు చేశారు. ‘సాహో’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ప్రభాస్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ గురించి స్పందించారు. తనకు రాజకీయాలు అంతగా తెలియవని చెప్పుకొచ్చిన ప్రభాస్.. ఏపీకి యంగ్ సీఎంగా ఉన్న జగన్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఆయన హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత సినీ పరిశ్రమకు చెందిన […]
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ షాకింగ్ కామెంట్లు చేశారు. ‘సాహో’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ప్రభాస్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ గురించి స్పందించారు. తనకు రాజకీయాలు అంతగా తెలియవని చెప్పుకొచ్చిన ప్రభాస్.. ఏపీకి యంగ్ సీఎంగా ఉన్న జగన్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఆయన హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత సినీ పరిశ్రమకు చెందిన కొందరు మాత్రమే ఆయనను అభినందించారు. దీనిపై నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ కూడా ఫైర్ అయ్యారు. జగన్ సీఎం కావడం టాలీవుడ్ పెద్దలకు ఇష్టం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌పై ప్రభాస్ ప్రశంసలు కురిపించడం విశేషం. మరోవైపు ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు బీజేపీలో ఉండగా.. జగన్‌ను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.