Saaho: ‘సాహో’కు సరిలేరు.. ‘లయన్ కింగ్’ బేజారు

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్ వద్ద తన గర్జనను చూపిస్తున్నాడు ప్రభాస్. అంతేకాదు నాలుగు రోజుల్లో 41మిలియన్ డాలర్లను సంపాదించిన సాహో.. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీల […]

Saaho: ‘సాహో’కు సరిలేరు.. ‘లయన్ కింగ్’ బేజారు
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2019 | 1:01 PM

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్ వద్ద తన గర్జనను చూపిస్తున్నాడు ప్రభాస్. అంతేకాదు నాలుగు రోజుల్లో 41మిలియన్ డాలర్లను సంపాదించిన సాహో.. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీల లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది.

కాగా విడుదల రోజు నుంచి ఈ మూవీకి అన్ని భాషల్లోనూ ఫ్లాప్ టాక్ వినిపించింది. సినిమాను చూసిన పలువురు క్రిటిక్‌లు ‘‘అబ్బే.. ఇదేమి సాహో’’ అంటూ పెదవి విరిచారు. అయితే కలెక్షన్లు అందుకు భిన్నంగా ఉన్నాయి. క్రిటిక్స్ రివ్యూను ఏ మాత్రం పట్టించుకోని ఆడియెన్స్ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని సాహో మెప్పించడంతో వారు ఈ సినిమాకు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. దీంతో అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కావడం.. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ క్రేజ్‌ అమాంతం పెరిగిపోవడం కూడా ‘సాహో’ కలెక్షన్లపై ప్రభావం చూపిందన్నది వారి మాట. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అత్యధిక థియేటర్లలో రిలీజైంది. ఈ నేపథ్యంలో మొదటి నాలుగు రోజులకు గానూ ముందుగానే ప్రీ బుకింగ్‌లు భారీగానే అయ్యాి. అందుకే మొదటి నాలుగు రోజుల్లో కలెక్షన్లు వస్తున్నాయన్నది కూడా టాక్. ఏది ఏమైనా.. టాక్ ఎలా ఉన్నా.. సాహో కలెక్షన్లు మాత్రం నిర్మాతలను కాస్త ఊరట కలిగించేవే.

ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించగా.. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి గిబ్రాన్ నేపథ్య సంగీతం అందించిన విషయం తెలిసిందే.

బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..