‘ సాహో ‘ కాపీ..కాపీ.. ఫ్రెంచ్ డైరెక్టర్ దీ అదే వాయిస్..

' సాహో ' కాపీ..కాపీ.. ఫ్రెంచ్ డైరెక్టర్ దీ అదే వాయిస్..

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ సాహో ‘ కు మరో దెబ్బ ! కంటెంపరరీ ఆర్టిస్ట్ షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ వర్క్ ను ఈ చిత్రంలో ఓ పాటకు మేకర్స్ కాపీ కొట్టి వాడుకున్నారంటూ బాలీవుడ్ నటి లీసా రే ఆరోపించి అందుకు తగిన ప్రూఫ్ ని చూపిన వైనం ఇంకా మరచిపోకముందే.. ఫ్రెంచ్ డైరెక్యర్ జెరోమ్ సాల్లే మరో బాంబు పేల్చారు. ఈ చిత్రం తన 2008 నాటి ‘ లార్గో వించ్ ‘ […]

Anil kumar poka

|

Sep 03, 2019 | 2:17 PM

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ సాహో ‘ కు మరో దెబ్బ ! కంటెంపరరీ ఆర్టిస్ట్ షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ వర్క్ ను ఈ చిత్రంలో ఓ పాటకు మేకర్స్ కాపీ కొట్టి వాడుకున్నారంటూ బాలీవుడ్ నటి లీసా రే ఆరోపించి అందుకు తగిన ప్రూఫ్ ని చూపిన వైనం ఇంకా మరచిపోకముందే.. ఫ్రెంచ్ డైరెక్యర్ జెరోమ్ సాల్లే మరో బాంబు పేల్చారు. ఈ చిత్రం తన 2008 నాటి ‘ లార్గో వించ్ ‘ కి కాపీ అని ఆయన కూడా తేల్చాడు. ఈ చిత్రానికి, ‘ సాహో ‘ కు మధ్య పోలికలను ట్విటర్ యూజర్లు.. ట్వీట్లు, పోస్టర్లతో సహా ట్యాగ్ చేసినట్టు తెలియగానే జెరోమ్ కూడా లైమ్ లైట్ లోకి వచ్ఛేశారు. ‘ లార్గో వించ్ ‘ కి ‘ సాహో ‘ సెకండ్ ఫ్రీ మేక్ అని, మొదటిదానికన్నా ఇది మరింత ‘ చెత్త ‘ అని అభివర్ణించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ అజ్ఞాతవాసి ‘ మూవీ లార్గో వించ్ కి కాపీ అని ఈయన గత ఏడాది ఆరోపించిన సంగతి తెలిసిందే.

‘ దయచేసి తెలుగు దర్శకులారా ! మీరు నా సినిమాలను దొంగిలిస్తే..కనీసం వాటిని ‘ ప్రాపర్ ‘ గా దొంగిలించండి ‘ అని అని సెటైర్ వేశాడాయన. ‘ నా ఇండియన్ కెరీర్ ట్వీట్ చాలామందికి బాధ కలిగించవచ్చు. కానీ నేనేం చేయలేను..అశక్తుడిని ‘ అన్నారు. నా చిత్రానికి సాహో ఫ్రీ మేక్.. మీరు నిజమైన గురువులు ‘ అని చమత్కరించారు. బహుశా ఇండియాలో నాకు మంచి కెరీర్ ఉండవచ్చునని భావిస్తున్నా అన్నారు. 2018 లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ అజ్ఞాతవాసి ‘ తన లార్గో వించ్ కి కాపీ అని జెరోమ్ ఆరోపించారు. భారత తెలుగు ‘ సినిమా ‘ లో మంచి టాలెంట్, క్రియేటివిటీ ఉన్నాయని, అయితే కాపీ కొట్టడంలో వారికి నైపుణ్యం లేదని ఆయన పేర్కొన్నాడు. పవన్ సినిమా ఫ్లాప్ ని బహుశా ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేరోమో అని వ్యాఖ్యానించాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu