ఎన్నార్సీపై దీదీ ఫైర్.. సామూహిక నిరసనలకు పిలుపు

ఎన్నార్సీ తుది జాబితాను వెస్ట్ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తోంది. కేంద్రం విడుదల చేసిన ఎన్నార్సీ తుది జాబితాను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరసనలు తెలపాలని సోమవారం నిర్ణయించింది. ఈ నిరసనలు వారం రోజుల పాటు సాగుతాయని.. టీఎంసీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు సెప్టెంబర్ 7,8 తేదీల్లో సామూహిక నిరసనల కార్యక్రమాన్ని పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 12న ఓ ర్యాలీని సైతం నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో […]

ఎన్నార్సీపై దీదీ ఫైర్.. సామూహిక నిరసనలకు పిలుపు
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2019 | 2:18 PM

ఎన్నార్సీ తుది జాబితాను వెస్ట్ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తోంది. కేంద్రం విడుదల చేసిన ఎన్నార్సీ తుది జాబితాను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరసనలు తెలపాలని సోమవారం నిర్ణయించింది. ఈ నిరసనలు వారం రోజుల పాటు సాగుతాయని.. టీఎంసీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు సెప్టెంబర్ 7,8 తేదీల్లో సామూహిక నిరసనల కార్యక్రమాన్ని పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 12న ఓ ర్యాలీని సైతం నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నార్సీ జాబితా నుంచి తప్పుకున్న 19 లక్షల మంది భవితవ్యంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి బీజేపీ చేస్తోన్న రాజకీయాలు, ఒకవేళ అధికారంలోకి వస్తే బెంగాల్లోనూ ఎన్నార్సీని అమలు చేయాలని బీజేపీ చూస్తోందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని మమతా బెనర్జీ నేతలను ఆదేశించారు.

Latest Articles