AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత అమ్ముల పొదిలో చేరిన అపాచీ..

భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. ప్రపంచంలోనే అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు భారత వాయుసేనలోకి చేరాయి. అన్ని రకాల పరిస్థితులను తట్టుకుని పనిచేయగల సత్తా దీని సొంతం. అపాచీ హెలికాప్ట‌ర్ల నిర్వ‌హ‌ణ కోసం ఇప్ప‌టికే మ‌న వాయు సేన ద‌ళం ప్రత్యేక శిక్ష‌ణ తీసుకున్న‌ది. అల‌బామాలోని ఫోర్ట్ రూక‌ర్ ఆర్మీ బేస్‌లో ట్రైనింగ్ జ‌రిగింది. బోయింగ్ సంస్థ‌కు చెందిన ఈ చాపర్ గ‌గ‌న‌త‌లంలో.. నేల‌పైన టార్గెట్ల‌ను చేధించ‌గ‌ల‌దు. ఈ ఏడాది జూలైలో నాలుగు అపాచీ ఏహెచ్-64 […]

భారత అమ్ముల పొదిలో చేరిన అపాచీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 03, 2019 | 12:33 PM

Share

భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. ప్రపంచంలోనే అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు భారత వాయుసేనలోకి చేరాయి. అన్ని రకాల పరిస్థితులను తట్టుకుని పనిచేయగల సత్తా దీని సొంతం. అపాచీ హెలికాప్ట‌ర్ల నిర్వ‌హ‌ణ కోసం ఇప్ప‌టికే మ‌న వాయు సేన ద‌ళం ప్రత్యేక శిక్ష‌ణ తీసుకున్న‌ది. అల‌బామాలోని ఫోర్ట్ రూక‌ర్ ఆర్మీ బేస్‌లో ట్రైనింగ్ జ‌రిగింది. బోయింగ్ సంస్థ‌కు చెందిన ఈ చాపర్ గ‌గ‌న‌త‌లంలో.. నేల‌పైన టార్గెట్ల‌ను చేధించ‌గ‌ల‌దు.

ఈ ఏడాది జూలైలో నాలుగు అపాచీ ఏహెచ్-64 చాపర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ భారత్‌కు అప్పగించింది. ఇవాళ మరో ఎనిమిది హెలికాప్టర్లను భారత వైమానికి దళానికి అందించింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ భారత వైమానిక స్థావరానికి వీటిని అందించారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మొదటగా ఐఏఎఫ్‌ చీఫ్‌ బీఎస్‌. ధనోవా ఆధ్వర్యంలో వీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసిన అనంతరం వాటర్‌ కేనన్‌ సెల్యూట్‌తో వాయుసేన సైనికులు అపాచీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ధనోవాకు బోయింగ్‌ ఇండియా అధ్యక్షుడు సలీల్‌ గుప్తా సెరిమోనియల్‌ కీ అప్పగించారు. అంతకుమందు వీటికి సంబంధించిన అన్ని రకాల ముందస్తు పరీక్షలను ఏఎఫ్‌ఎస్‌ హిండన్‌ వాయుస్థావరంలో విజయవంతంగా జరిపినట్లు భారత వాయుసేన ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన నాలుగు నిమిషాల వీడియోను కూడా పోస్ట్‌ చేశారు.

అయితే బోయింగ్‌ సంస్థ ఇప్పటి వరకు 2200 అపాచీ హెలికాప్టర్లను పలుద దేశాలకు అందించింది. కాగా, ప్రస్తుత ఏహెచ్-64 ఈ తరహా చాపర్లను ఉపయోగిస్తున్న 16వ దేశం భారత్‌ కావడం విశేషం. 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని భారత వాయుసేన 2015లో కుదుర్చుకుంది. 2020నాటికి మొత్తం 22 హెలికాప్టర్లు భారత వాయుసేనలో చేరనున్నాయి.

చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగ
రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగ
వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలిః ప్రధాని మో
డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలిః ప్రధాని మో