బ్రేకింగ్: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓఎన్‌జీసీ ప్లాంట్‌లోని కోల్డ్‌స్టోరేజ్ ఏరియాలో జరిగిన పేలుడులో జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పదిమందికిపైగా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 50ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ మంటల నేపథ్యంలో అక్కడ […]

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓఎన్‌జీసీ ప్లాంట్‌లోని కోల్డ్‌స్టోరేజ్ ఏరియాలో జరిగిన పేలుడులో జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పదిమందికిపైగా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 50ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ మంటల నేపథ్యంలో అక్కడ ఉన్న గ్యాస్‌ను గుజరాత్‌లోని హజీరా ప్లాంట్‌కు మళ్లించినట్లు ఓఎన్‌జీసీ ప్రకటించింది.
దీనిపై ట్వీట్ చేసిన ఓఎన్‌జీసీ ప్రతినిధులు.. ‘‘అర్బన్ ఆయిల్, గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లోని స్ట్రామ్‌వాటర్ డ్రైనేజీ గదిలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఓఎన్‌జీసీ ఫైర్ సిబ్బంది, ప్రకృతి వైపరిత్యాల నివారణ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆయిల్ ప్రాసెసింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవు. గ్యాస్ మొత్తాన్ని హజీరా ప్లాంట్‌కు తరలించాం. ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
Maharashtra: Fire breaks out at a cold storage at Oil and Natural Gas Corporation (ONGC) plant in Uran, Navi Mumbai. Fire tenders have reached the spot. pic.twitter.com/V2HSCt58nJ
— ANI (@ANI) September 3, 2019